English | Telugu

సుడిగాలికి పవిత్ర వార్నింగ్..నీ వీడియోస్ అన్నీ బయటపెడతా...

సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న ఫామిలీ స్టార్స్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రంగుల రాట్నం వెర్సెస్ కలిసుందాం రా సీరియల్ టీమ్స్ వచ్చాయి. ఇక సుడిగాలి సుధీర్ వీళ్ళను బాగా పటాయించాడు. ఇక రెండు సీరియల్స్ లో అమ్మాయిలను తెగ పొగిడేసాడు. "వర్షం పడుతుందా ఏంటండీ...సడెన్ గా సెట్ లో ఇంద్రధనుస్సును చూస్తే...." అని ఒక సీరియల్ హీరోయిన్.."మీ సీరియల్ లక్ష ఎపిసోడ్స్ ఐనా అవ్వాలనుకుంటానండి ఎప్పుడూ మిమ్మల్ని లక్ష సార్లు చూడొచ్చు కదా" అంటూ తెగ బిల్డప్ ఇచ్చేసాడు.

ఇంతలో భానుశ్రీ వచ్చి "నిన్న లక్ష సార్ల కంటే ఎక్కువగానే పొగిడాం..ఐనా ఎప్పుడైనా నన్ను పొగిడావా" అనేసరికి " 30 ఎపిసోడ్స్ చూసేసరికి చిరాకొచ్చేసింది" అంటూ ముఖాన్ని తెగ చిరాకుగా పెట్టి మరీ చెప్పాడు. దాంతో భాను కొంచెం హర్ట్ ఐనట్టు కనిపించింది. ఇక తర్వాత సీన్ లోకి పవిత్ర "రగులుతోంది మొగలి పొద" అంటూ నల్ల రంగు చీరలో పాములా వచ్చింది. ఐనా "నువ్వు పాము కదా" అని సుధీర్ పవిత్రని అడిగేసరికి " పాము గురించి నీకేం తెలుసు కాటేయడం తప్ప" అని కౌంటర్ వేసింది. తర్వాత మరో పెద్ద ఝలక్ ఇచ్చింది. గొడుగేసుకుని మందాకినిలా వచ్చి "ఏయ్...నాతో చేయవా..." అనేసరికి సుధీర్ తెగ నవ్వలేక నవ్వుకుని చిరాగ్గా "ఏంటి నీ ప్రాబ్లమ్ " అని సీరియస్ గా అడిగాడు.. "వేద్దాం దా డాన్స్" అని కైపుగా, మత్తుగా అడిగింది."నేను వేయనమ్మా డాన్స్ " అని చెప్పేసాడు సుధీర్. "వస్తావా..నీ వీడియో క్లిప్స్ అన్ని ప్లే చేయమంటావా" అంటూ బెదిరించేసింది పవిత్ర. దానికి సుధీర్ దగ్గర ఆన్సర్ లేదు. పవిత్ర అన్న వీడియో క్లిప్స్ అన్న మాటకు షాకైపోయాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.