English | Telugu

తేజ సజ్జ అంటే నాకు క్రష్.. ఈ అమ్మాయిలంతా ఇంతే!

ఢీ షోలో ప్రెజెంట్ దుమ్ము రేపుతున్న భూమికను ఇంటర్వ్యూ చేసాడు మరో టాప్ డాన్సర్ పండు. అది కూడా రొటీన్ కి భిన్నంగా. "ఢీలో నీకు ఎవరంటే ఇష్టం" "విజయ్ బిన్నీ మాష్టర్" "ఆయనంటే నాకు కూడా ఇష్టమే ఆయన కాకుండా ఇంకెవరంటే ఇష్టం" అంటూ పండు మెలికలు తిరుగుతూ అడిగాడు. వెంటనే భూమిక హోస్ట్ నందు గారంటే ఇష్టం అని చెప్పింది. "యాహ్..వెల్కమ్ బ్యాక్ అంటుంటాడు హైట్ ఉంటాడు. ఈ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది. వీళ్ళు కాకుండా నీకు స్పెషల్ గా పర్సనల్ గా ఎవరంటే ఇష్టం" అని మళ్ళీ అడిగాడు. ఇంకా పర్సనల్ గా వెళ్తే ఆది గారు. ఓహ్ హైపర్ ఆది..సరే ఇంకా ఇంకా ఇంకా బాగా పర్సనల్ గా ఎవరంటే ఇష్టం." అని మళ్ళీ మళ్ళీ అడిగాడు.

"ఇంకా ఇంకా ఎవరిష్టం అంటే రాజు" అని చెప్పింది. "ఇంత అందగాడిని ఎదురుగా పెట్టుకుని ఇన్ని సార్లు అడుగుతుంటే నా పేరు కాకుండా రాజు పేరు చెప్తోంది. ఈ అమ్మాయిలంతా ఇంతే ఎంత అందంగా ఉంటె అంత టెక్కు ఎక్కువగా ఉంటుందన్నమాట." అన్నాడు. ఇక తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాడు. "మీ ఊరు ఎక్కడ" అని అడిగాడు. "కర్ణాకటకలోని మండ్య" అని చెప్పింది. "నువ్వు చాలా అందంగా ఉంటావ్ కదా. నీకు ఏమన్నా ప్రొపోజల్స్ వచ్చాయా..ఒక స్పెషల్ ప్రొపోజల్ అంటూ ఏమైనా ఉన్నదా" అని అడిగాడు. "చాలా వచ్చాయి. అలాంటి ప్రొపోజల్స్ ఏమీ రాలేదు. అందుకే ఇంకా సింగల్ నేను" అంది. "అంత స్పెషల్ ప్రొపోజల్ నేను చేస్తే ఒప్పుకుంటావా" అని అడిగాడు పండు "అస్సలు ఒప్పుకోను" అని చెప్పింది. "హీరో క్రష్ ఎవరైనా ఉన్నారా" అన్నాడు.

"మహేష్ బాబు గారు అలాగే తేజ సజ్జ గారు" అని చెప్పింది. "ఢీలోకి ఎలా వచ్చావ్" అని అడిగాడు. ఆడిషన్స్ ఇచ్చాను ప్రభు దేవా మాష్టర్ తరపున వచ్చాను" అని చెప్పింది. ఢీ - 20 ఫైనల్స్ కి ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నావు అన్నాడు. నేను ఫైనల్స్ కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా నాకు పోటీగా రాజు కానీ సంకేత కానీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా అని చెప్పింది. "నన్ను చూస్తున్నావ్ కదా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా కదా" అన్నాడు. "అలా ఇప్పుడు అనిపించట్లేదు..సారీ పండు" అంటూ పరువు తీసేసింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.