English | Telugu
Bigg Boss 9 Telugu: దివ్యని తీయడానికి తనూజ స్కెచ్.. రీతూని వాడుకుందిగా!
Updated : Nov 29, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం ఫ్యామిలీ వీక్ జరిగింది. ఈ వారం కెప్టెన్సీ కోసం టాస్క్ లు జరిగాయి. ఇక ఈ సీజన్ లో చివరి కెప్టెన్ కాబట్టి గేమ్ మరింత రసవత్తరంగా సాగింది. కంటెండర్స్ ఆరుగురికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బజర్ మోగగా భరణి వెళ్లి డ్రాగన్ పట్టుకుంటాడు. అది డీమాన్ కి ఇస్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ ని అతను కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగిస్తాడు. ఇద్దరికి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నామినేట్ చేసేటప్పుడు అన్న ఏడుపొస్తుంది మిమ్మల్ని చెయ్యాలంటే అన్నావ్.. అదంతా వద్దు ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ టాస్క్ నుండి తీసేస్తున్నావని ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు.
ఇక ఆ తర్వాత డ్రాగన్ ఎవరికి ఇస్తే ఎవరిని ఎవరు తొలగిస్తారో కంటెండర్ గా లేనివాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. బజర్ మోగగానే తనూజ వెళ్లి డ్రాగన్ పట్టుకుంటుంది.. అది తీసుకొని రీతూకి ఇస్తుంది. దాంతో దివ్యని రీతూ తొలగిస్తుంది. నాకు నువ్వు స్ట్రాంగ్ అనిపిస్తున్నావ్.. నువ్వు ఉంటే నేను కెప్టెన్ కాలేనని రీతూ రీజన్ చెప్తుంది. నాకు భయపడుతున్నావా అని అందుకే తీసేస్తున్నావ్ అని దివ్య అంటుంది. మిగతా వాళ్ళు టఫ్ అనిపించడం లేదా అని దివ్య లాజిక్ మాట్లాడుతుంది. వాళ్ళు స్ట్రాంగ్.. వాళ్ళతో ఆడి గెలవాలని నిన్ను తీసేసానని రీతు అంటుంది. నాకు భయపడి అని దివ్య అంటుంది. అవును నీకు భయపడి, నువ్వు తోప్ అని రీతు అంటుంది. అవును నేను తోపు.. పెద్ద బాడీ ఉంది.. పొగరు ఉందని దివ్య అంటుంది.
తనూజ నీకు ముందే నన్ను తీసేస్తుందని తెలిసే రీతూకి ఇచ్చావా అని తనూజని దివ్య అడుగుతుంది. నువ్వు కళ్యాణ్ కి ఇవ్వొచ్చు కదా అని తనూజతో దివ్య అంటుంది. కళ్యాణ్ కి అప్పుడు టఫ్ అవుతుందని తనూజ అంటుంది. అలా ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరుగుతాయి. ఆ తర్వాత బజర్ మోగగానే సంజన డ్రాగన్ పట్టుకుంటుంది. కళ్యాణ్ నీకు ఇస్తే ఎవరిని తీసేస్తావని సంజన అడుగుతుంది. కళ్యాణ్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. డీమాన్ తో డిస్కషన్ చేస్తాడు. మీ అమ్మ రెండోసారి నువ్వు కెప్టెన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నేను నువ్వు కాకుంటే మాత్రం హర్ట్ అవుతాను.. నువ్వు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని కళ్యాణ్ తో తనూజ చెప్తుంది. ఆ తర్వాత సంజన, కళ్యాణ్ కి డ్రాగన్ ఇస్తుంది. కళ్యాణ్, రీతూని తొలగిస్తాడు. నేను డీమాన్ తో పోటీ పడాలనుకుంటున్నానని కళ్యాణ్ రీజన్ చెప్తాడు.