English | Telugu

నా చివరి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ - 2 !

ఆలీతో సరదాగా షోకి ఎంతో మంది ఫేమస్ పర్సన్స్ వస్తూ ఉంటారు. అలాంటి ఇంటెలెక్ట్యువల్స్ లో అశ్వనీ దత్ ఒకరు. ఇక ఈ షోకి సంబంధించి రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. గౌరీశంకరుల కథ సినిమా షూటింగ్ టైంలో ఇండస్ట్రీలో ఏదో ఇన్సిడెంట్ జరిగిందట కదా ఏమిటది అని ఆలీ అడిగేసరికి సింగీతం ఒక వైపు , కేవీ రెడ్డి ఒక వైపు ఉన్నారట. ఇంతలో ఒక పాము సెట్ లోకి వచ్చిందట. సింగీతం గారు పాము అనేసరికి వదలండి బ్రదర్ వారే వస్తారు ఇక్కడికి అన్నారట సీనియర్ ఎన్టీఆర్.

ఆయన ఎవరినైనా అలా గౌరవంగా పిలుస్తారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళలేదు అనేసరికి పార్టీ అభిమానిగా ఉన్నాను, ఒక మెంబర్ గా ఉన్నాను తప్ప ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఎప్పుడూ అనిపించలేదన్నారు. ఇంకా వైజయంతి బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసరికి మైండ్ లో అనుకుంటున్నాను కానీ ముందుకు వెళ్లడం లేదు...అదే నా ఆఖరి చిత్రం అని నా మైండ్ లో డిక్లేర్ చేసుకున్నా అది జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీద్దామని అనుకుంటున్నా అని చెప్పారు.

కృష్ణుడి రూపంలో ఉండే సీనియర్ ఎన్టీఆర్ ని ఎప్పటికీ దైవంగానే భావిస్తానన్నారు అశ్వనీ దత్. అప్పట్లో ఎదురులేని మనిషి సినిమాకు 16 లక్షలు అయ్యాయని చెప్పేసరికి ఈ రోజుల్లో ఆ మొత్తాన్ని వాళ్ళ మేకప్ మెన్స్ కి ఇస్తున్నారు కదా అంటూ ఆలీ పంచ్ వేస్తాడు. జాతిరత్నాలు సినిమా కథ విన్నారా అని అడిగేసరికి చెప్పడానికి అక్కడ కథ ఉంటేగా అన్నీ కామెడీ సీన్స్ మాత్రమే తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్ లో చూస్తే పడీ పడీ నవ్వుకున్నా అని చెప్పారు అశ్వనీదత్ .

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.