English | Telugu

Brahmamudi: కన్నపేగు బంధమే.. దొంగ అంత పని చేశాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -260 లో.. కనకం నిద్రలో ఒక కల కంటుంది. అప్పు గదిలోకి కనకం వెళ్ళి చూసేసరికి అప్పు సుసైడ్ చేసుకున్నట్లు కల కంటుంది. దాంతో ఒక్కసారిగా‌ కనకం నిద్ర నుండి ఉలిక్కిపడి లేవగానే.. ఏంటి అని కృష్ణమూర్తి అడుగుతాడు. ఆ తర్వాత కనకం అప్పు గదిలోకి వెళ్తుంది. కనకం వెళ్లేసరికి అప్పు తన గదిలో ఉండదు. దాంతో కనకానికి ఇంకా టెన్షన్ అవుతుంది.

ఆ తర్వాత కనకం ఇంట్లో చుసి బయటకు వస్తుంది. అప్పు బయట బాధపడుతు ఉండడం చూసి.. ఇక్కడ ఎందుకు ఉన్నావని కనకం అడుగుతుంది. నాకు ఇక్కడ ఉండే స్వేచ్చ కూడా లేదా అని అప్పు అనగానే.. నీకు ఎప్పుడు స్వేచ్ఛ ఇచ్చాను. అబ్బాయిలతో ఫ్రెండ్ షిప్ చేసినా, వాళ్ళతో తిరిగినా, నీకు ఎప్పుడు అడ్డుచెప్పలేదని కనకం అనగానే.. అడ్డు చెప్పిన బాగుండేది. ఇప్పుడు నాకు ఈ సిచువేషన్ రాకపోయేదేమోనని అప్పు అంటుంది. ఆ తర్వాత అప్పుని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది కనకం. నేను నీ దగ్గర పడుకుంటానని కనకం చెప్తుంది. కావ్య ఉంటే నన్ను కష్టపెట్టేది కాదని అన్నాను కదా? నువ్వు బాధపడ్డావా అని కనకం అడుగుతుంది. లేదు అక్క అంటే నాకు ఇష్టం. ఎందుకు బాధపడుతానని అప్పు అంటుంది. కానీ నువ్వు నువ్వు నా పక్కన ఉంటే దైర్యంగా ఉంటుంది. ఒక కొడుకులాగా నన్ను ఎప్పుడు వదిలి వెళ్లొద్దని కనకం అనగానే.. అప్పు ఎమోషనల్ అయి కనకాన్ని హత్తుకొని ఏడుస్తుంది. మరొకవైపు రాజ్ కావ్య పడుకున్నాక వారి గదిలోకి దొంగ వస్తాడు. రాజ్ కావ్యల కాళ్ళు చేతులు కట్టివేస్తాడు ఆ దొంగ. ఆ తర్వాత ఇద్దరికి మెలుకువ వస్తుంది. వచ్చిన తర్వాత దొంగని చూసి ఇద్దరు బయపడతారు‌‌. దొంగ అన్నయ్య అంటూ కావ్య మాట్లాడేసరికి.. నన్ను ఇంతవరకు ఎవరు ఇలా పిలువలేదు. నా దొంగ చెల్లి అంటూ ఆ దొంగ అంటాడు‌. కాసేపు కావ్య, ఆ దొంగ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రాజ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత రాజ్ కావ్యల కట్లు విప్పకుండానే దొంగ వెళ్ళిపోతాడు.

మరొకవైపు పది లక్షలు ఎవరిని అడగాలి. అరుణ్ డబ్బులు తీసుకొని రమ్మని లొకేషన్ కూడా షేర్ చేసాడని స్వప్న టెన్షన్ పడుతుంది. నగలు తాకట్టు పెడతా ఇంట్లో వాళ్ళు నగలు ఎక్కడ అంటే రాహుల్ పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకీ ముందు నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తు రాహుల్ దొరికిపోయాడు కదా.. రాహుల్ తీసుకొని వెళ్ళిపోయాడని అబద్దం చెప్పొచ్చని స్వప్న అనుకుంటుంది. అదంతా రాహుల్ విని షాక్ అవుతాడు. తరువాయి భాగంలో అరుణ్ ని స్వప్న కలిసిన విషయం రాహుల్ ఇంట్లో అందరికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.