English | Telugu
నాల్గవ హౌజ్ మేట్ ఫైనల్ రేసులో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్!
Updated : Sep 29, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి అంచనాలు తారుమారవుతున్నాయి. ఏదీ ఊరికే రాదు. లక్, హార్డ్ వర్క్ ఉంటే సరిపోతుందని అనుకునే వాళ్ళకి ఈ షో.. అల్టిమేట్ ట్విస్ట్ లని అందిస్తుంది. అదేలా అంటే ఈ షోలో మొదటగా పద్నాలుగు మంది కంటెస్టెంట్ వచ్చారు. అందులో మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. రెండవ వారం షకీల, మూడవ వారం దామిణి అయింది. నాల్గవ వారం మొత్తం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు బయటకు వెళ్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
గురువారం జరిగిన ఎపిసోడ్‌లో బజర్ ని ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తారో వారికే కంటెండర్ కోసం పోటీపడే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో అందరు కంటెస్టెంట్స్ పోటీలో పాల్గొనగా అమర్ దీప్ మొదటగా బజర్ ప్రెస్ చేశాడు. దాంతో అతనికి సపోర్ట్ గా పల్లవి ప్రశాంత్ ని ఎన్నుకున్నాడు యావర్. ఇక పోటీలో వారికి ప్రత్యర్థులుగా అమర్ దీప్, గౌతమ్ కృష్ణలని ఎన్నుకున్నాడు యావర్. 'గ్లాస్ ఈజ్ షార్డ్ ఫిల్ ఇట్ ఫాస్ట్' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇదేంటంటే ఇచ్చిన గ్లాస్ లో తమ కన్నీళ్ళతో ఆ గ్లాస్ ని నింపాలి. ఎవరైతే ఫస్ట్ ఆ గ్లాస్ నింపుతారో వాళ్ళే విజేతలని బిగ్ బాస్ ప్రకటించగా.. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ మొదడ కన్నీళ్ళని గ్లాస్ లో నింపి విజేతలుగా నిలిచారు. దాంతో అమర్ దీప్, గౌతమ్ కృష్ణల దగ్గరున్న బిబి కాయిన్స్ యావర్, ప్రశాంత్ లకి లభించాయి. అలా నాల్గవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి యావర్, పల్లవి ప్రశాంత్ అర్హత సాధించారు.
అయితే ఇప్పటి దాకా సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ కలిసి ఆడేవారు. ఇప్పుడు యావర్ సంఛాలక్ గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సారి కూడా నాగార్జున శోభా శెట్టి, ఆట సందీప్ ల బ్యాటరీ తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే బజర్ మొదట అమర్ దీప్ ప్రెస్ చేశాడని ఆట సందీప్, శోభా శెట్టి వాదించారు. లేదని శివాజీ ఎంత చెప్పిన వినలేదు. అయితే మొదట పల్లవి ప్రశాంత్ వచ్చి బజర్ ప్రెస్ చేశాడా లేక అమర్ దీప్ ప్రెస్ చేశాడా అనేది తెలియాలంటే వీకెండ్ లో నాగార్జున వచ్చి.. టీవీలో ప్లే చేస్తేనే తెలుస్తుంది. అయితే రోజు రోజుకి సీరియల్ బ్యాచ్ చుట్టు ఉంటున్న ఆట సందీప్ వాళ్ళలో కలిసిపోయి కావాలని యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీలని టార్గెట్ చేస్తున్నాడు. ఇక వీకెండ్ లో ఈ సీరియల్ బ్యాచ్ కి గట్టిగానే క్లాస్ పడేలా ఉంది. చూడాలి మరి నాల్గవ హౌజ్ మేట్ గా ఎవరు ఎంపిక అవుతారో చూడాలి మరి.