English | Telugu

బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతున్న ప్రేమ ఎంత మధురం అను!

బుల్లితెరపై టీవీ సీరియల్స్ కి ఉండె క్రేజ్ అంతా ఇంత కాదు. తెలుగు రాష్ట్రాలలో స్టార్ మా టీవీ, జీ తెలుగు సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో బ్రహ్మముడి, త్రినయని, గృహలక్ష్మి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ టాప్ లో ఉండగా.. ప్రేమ ఎంత మధురం టాప్-10 లో ఉంది.

ప్రేమ ఎంత మధురం సీరియల్ లో అను, ఆర్యవర్థన్ ల ఆన్ స్క్రీన్ మీద చేసే నటనకి ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. 'ప్రేమ ఎంత మధురం' .. జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్. ఇందులో శ్రీరామ్ వెంకట్ మరియు వర్ష హెచ్ కె నటించారు. ఇది మరాఠీ టీవీ సిరీస్ 'తులా పహతే రే' యొక్క అధికారిక రీమేక్ . ఈ సీరియల్ 10 ఫిబ్రవరి 2020 న మొదలైంది. సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్న 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ కి శ్రీరామ్ వెంకట్ నిర్మాతగా చేస్తున్నాడు.

ఈ సీరియల్ కథ విషయానికొస్తే.. టికెఆర్ కళాశాల ఆర్యవర్ధన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తన కారుకు జరిమానా విధించినందున అతను కళాశాలకు సైకిల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దురదృష్టవశాత్తు, అతని సైకిల్ పంక్చర్ అయింది, కాబట్టి అతను ఆటోలో కాలేజీకి వెళ్తాడు. ఆ ప్రయాణంలో కాలేజీ ఫంక్షన్‌లో తనకు స్వాగతం పలికేందుకు స్పీచ్‌ని సిద్ధం చేస్తున్న అనును కలుస్తాడు. రెండు రూపాయలకు కూడా విలువ ఇచ్చే ఆమె తత్వానికి అతను ముగ్ధుడవుతాడు. ఆర్య వర్ధన్ ఈ ఫిలాసఫీని ఉపయోగించి 10rs రీఛార్జ్ కార్డ్ ధరను 8rs కి తగ్గించాడు.

ఇది వర్ధన్ కంపెనీకి భారీ లాభాన్ని అందించింది. దాంతో అతను అనుకు తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చాడు. అలా ఒకే కంపెనీలో ఉండేసరికి వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే అను తల్లి తన మేనల్లుడు సంపత్‌ని పెళ్లి చేసుకునేందుకు అనును ఒప్పించాలని ఆర్య వర్ధన్‌ని కోరింది. ఆర్య వర్ధన్ సంపత్‌ని పెళ్లి చేసుకోమని అడుగగా.. అను గుండె ముక్కలైనంత పని అయింది. అను సంపత్‌తో పెళ్లికి అంగీకరిస్తుంది. తరువాత, సంపత్ తండ్రి రఘుపతి తన కంపెనీతో వ్యాపార సంబంధాల కోసం వివాహాన్ని ఉపయోగించుకుంటున్నాడని ఆర్య వర్ధన్ తెలుసుకుంటాడు.

అతను రఘుపతి యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని అను కుటుంబానికి తెలిసేలా చేస్తాడు. దాంతో అను పెళ్ళి ఆగిపోతుంది. అతని కంపెనీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన జెండే ఆర్య వర్ధన్ కి ప్రాణస్నేహితుడు. అతని పతనానికి అను కారణం కావచ్చని అనుకొని తనకి ఆర్యవర్థన్ ని దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. కాబట్టి ఆర్య వర్ధన్ అనును వైజాగ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ అతను అను పట్ల తనకున్న భావాలను గ్రహించి తన మనసు మార్చుకుంటాడు‌. మరియు ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. అలా ఈ కథ ముందుకి సాగుతుంది.

ఆర్య వర్ధన్, అనుల లవ్ స్టోరీకి ఇప్పటికే ఈ సీరియల్ అభిమానులు ఫిధా అయ్యారు.అను, ఆర్య వర్ధన్ లకి ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అను అలియాస్ హర్ష వికే తాజాగా థాయ్ లాండ్ కి వెకేషన్ కి వెళ్లింది. అక్కడ దిగిన కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే అందులో కొన్ని బోల్డ్ గా ఉన్నాయి. సీరియల్ లో సంప్రదాయబద్ధంగా కన్పించే ఈ అను.. బయట హర్షగా తన పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఖాళీ ఉన్న టైమ్ లో ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కి వెళ్తూ సరదాగా గడుపుతుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.