English | Telugu

సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ... రైతుబిడ్డని‌ తిట్టిన అమర్ దీప్!  

సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ... రైతుబిడ్డని‌ తిట్టిన అమర్ దీప్!  

బిగ్ బాస్ హౌజ్ లో సీరియల్ బ్యాచ్ చేసే పనులతో మిగిలిన కంటెస్టెంట్స్ కి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.  శోభా శెట్టి, ఆట సందీప్, ప్రియాంక జైన్, అమర్ దీప్ మాట్లాడిన విధానం చూస్తుంటే వాళ్ళంతా కలిసి శివాజీని టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే శివాజీ లాజిక్ గా వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడేసరికి ఒక్కొక్కరికి దిమ్మతిరిగిందనే చెప్పాలి.

అసలేం జరిగిందంటే బజర్ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదని ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ బజర్ దగ్గర ఉండి తింటున్నారు. అయితే వాళ్ళు అలా తినడం చూసిన ఆట సందీప్.. ఏంటి వాళ్ళు అక్కడ తింటున్నారని ప్రియాంక జైన్ ని అడుగగా.. ఇప్పటికీ ఆరు చపాతీలు తిన్నాడని చెప్తుంది. ఇక శుభశ్రీ ఆమ్లెట్ కూడా తిన్నాడని చెప్తుంది. ఇక అప్పుడే పల్లవి ప్రశాంత్ అన్నం తీసుకొని వెళ్ళగా యావర్ తింటున్నాడు. అది చూసి ఆట సందీప్ .. అసలేంటి వీడు, ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడేంటని అన్నాడు.

ఇక అప్పుడే శివాజీ వచ్చి రెండు చపాతీలు ఇవ్వండని యావర్ కోసమని అడిగితే.. ఇది చాలా అన్ ఫేర్ అన్న, ఇప్పుటికే వాడు ఆరు చపాతీలు తిన్నాడు, ఎగ్స్ తిన్నాడు.. ఇప్పుడు మీరొచ్చి మళ్ళీ రెండు చపాతీలు తీసుకెళ్తున్నారంటూ గొడవకి దిగాడు.‌ ఇప్పుడేంటి తినకూడదా,‌ ఇలా తినే ఫుడ్ దగ్గర చేయడం బాగోదని అన్నాడు. అయినా సరే వినకుండా శోభా శెట్టి వితండవాదం చేసింది. జనాలు చూస్తున్నారని శివాజీ మాట్లాడగా.. అన్న మీరు కావలనే మమ్మల్ని నెగెటివ్ గా పోట్రేట్ చేస్తున్నారంటూ మాట్లాడింది. అమ్మ నువ్వు ఇక్కడికి చపాతీలు చేయడానికి రాలేదు. నువ్వు చేసేది జనాలు చూస్తున్నారంటూ శివాజీ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.‌

ఇక ఆ తర్వాత అమర్ దీప్, ఆట సందీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి కలిసి సిగరెట్ తాగే ప్లేస్ లో కూర్చొని.. శివాజీ అన్న కావాలని ప్రిన్స్ యావర్ ని వెనకేసుకొస్తున్నాడంటూ మాట్లాడుకున్నారు. ఇప్పటి దాకా గ్రూప్ గా ఆడలేదు. ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అమర్ దీప్ చెప్పాడు. ఇక గ్లాస్ లో కన్నీళ్ళు నింపే టాస్క్ లో అమర్ దీప్ చీప్ మెంటాలిటి బయటపడింది. అక్కడ అమర్ దీప్, గౌతమ్ కృష్ణ కలిసి ఏదో విధంగా కన్నీళ్ళు నింపాలని నిమ్మకాయ, ఉల్లిపాయలు కళ్ళలో పిండుకొని కన్నీళ్ళతో గ్లాస్ లో పోస్తున్నారు. ఇక అప్పుడే బిగ్ బాస్ ఏదో విధంగా కాదు ఏడ్చి లేదా నవ్వితే వచ్చిన కన్నీళ్ళతో గ్లాస్ నింపాలని బిగ్ బాస్ చెప్తాడు.

అయితే అప్పటికే తన కన్నీళ్ళతో సగం గ్లాస్ నింపిన ప్రశాంత్.. అవును అన్న నా గ్లాస్ లోని కన్నీళ్ళు కూడా పడబోసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తానని అనగానే అమర్ దీప్ విని.. రేయ్ నువ్వు అంతగా నటించకురా, నీ బతుకేంత, నువ్వెంత నాకు తెలుసు. బయట నీ వీడియోలు చూస్తేనే తెలుస్తుందంటు చీప్ గా హేళన చేస్తూ మాట్లాడాడు. అయితే బిగ్ బాస్ మేకర్స్ కావాలని దీన్ని టీవీలో ప్రసారం చేయకుండా ఎడిటింగ్ లో తీసేశారు. ఇలాగే ప్రతీసారీ అమర్ దీప్ కి ఫేవర్ గా ఫుటేజ్ కి ప్లే చేస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అమర్ దీప్ మెంటాలిటి చూసిన నెటిజన్లు.. ఒక్కసారి నామినేషన్లోకి వస్తే ఇక బ్యాగ్ సర్దుకోవాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీరియల్ బ్యాచ్ చేసే పాలిటిక్స్ కి సిన్సియర్ గా గేమ్ ఆడే మిగతా కంటెస్టెంట్స్ ఎన్ని రోజులు బలి అవుతారో ఏమో చూడాలి మరి!