English | Telugu
కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఈజ్ బ్యాక్.. గురుశిష్యుల ఆనందతాండవం!
Updated : Oct 13, 2023
కెప్టెన్ ఈజ్ బ్యాక్.. రైతే రాజు పల్లవి ప్రశాంత్ రోజు రోజుకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకొని ఆరవ వారం కొనసాగుతుంది. ఇందులో కెప్టెన్సీ పోటీ కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.
పల్లవి ప్రశాంత్ కష్టపడి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే మొన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ అందరి ముందు పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేసుకున్నాడు. హౌజ్ లోని వారిని అసలు కెప్టెన్ భాద్యతలు ఏంటివి అని వారి అభిప్రాయం తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసుకున్న బిగ్ బాస్.. నిన్నటి ఎపిసోడ్ లో కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. కెప్టెన్ గా నీ భాద్యతలు తెలుసుకోవాలని, ఇది నీకొక హెచ్చరిక అని బిగ్ బాస్ చెప్పగా.. పల్లవి ప్రశాంత్ తన వివరణ ఇచ్చాడు. కొందరు ఏం చెప్పినా చేయట్లేదని, వీడు చెప్తే వినేదేంది అన్నట్టుగా చూస్తున్నారని తను ఎదుర్కొంటున్న వాటిని బిగ్ బాస్ తో పల్లవి ప్రశాంత్ చెప్పగా.. కెప్టెన్ అంటే ఇంటి సభ్యులతో పనులు చేపిస్తు, కమాండింగ్ తో పాటు ఫెయిర్ డెషిషన్స్ తీసుకోవాలని పల్లవి ప్రశాంత్ తో బిగ్ బాస్ అన్నాడు.
ఇకనుండి కెప్టెన్ గా సరిగ్గా బాధ్యతలని నిర్వర్తించాలని బిగ్ బాస్ చెప్తూ బ్యాడ్జ్ ని ప్రశాంత్ కి ఇవ్వగా.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి బ్యాడ్జ్ తో బయటకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇక బయటకు రాగానే గురువు శివాజీని హత్తుకున్నాడు. ఆ తర్వాత శివాజీ చేతిని ముద్దాడుతుంటాడు ప్రశాంత్. ఇక శిష్యుడితో గురువు.. నువ్వేంటో చూపించు అని అంటాడు. దాంతో ఇక నుండి నేనేంటో చూపిస్తానని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఇలా పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉందని మరోసారి ఋజువైంది.