English | Telugu

అలా దొరికేసింది కావ్య.. వాళ్ళిద్దరికి డౌట్ మొదలైన వేళ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -225 లో... సీతారామయ్య, ఇందిరాదేవీలు కావ్యని ఇంటికి రమ్మని పిలుస్తారు. అప్పుడే రాజ్ వచ్చి ఇంత టెన్షన్ ఎందుకు పెట్టావని కావ్యపై కోప్పడతాడు. కావ్య ఇక్కడ ఉన్నట్లు మీకెలా తెలుసని సీతారామయ్యాని రాజ్ అడుగుతాడు. పూజారి గారు ఫోన్ చేసి చెప్పాడని సీతారామయ్య అంటాడు. మేం ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసని రాజ్ ని సీతరామయ్య అడుగగా.. కావ్య గురించి వెతుకుతుంటే బయట మీ కార్ కన్పించిందని రాజ్ అంటాడు.

ఆ తర్వాత రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అది ప్రేమ అంటావా? అది కూడా నటననేనా అని సీతరామయ్యని ఇందిరాదేవి అడుగుతుంది. అది ప్రేమ వాడికి కావ్య అంటే ప్రేమ ఉందని సీతారామయ్య అంటాడు. మరొక వైపు మా కూతురు ఎక్కడ అంటు.. దుగ్గిరాల ఫ్యామిలీని కనకం నిలదిస్తునే ఉంటుంది. కనకం మాటలకు ఇంట్లో వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు.

అప్పుడే కావ్యను రాజ్ తీసుకొని వస్తాడు. కనకం దుగ్గిరాల ఫ్యామిలిని కించపరిచేలా మాట్లాడ్డం విన్న కావ్య కోపంగా ఆగు అమ్మా అని అరుస్తుంది. ఆ తర్వాత కనకం వచ్చి కావ్యని హాగ్ చేసుకొని.. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. నేను వచ్చేకంటే ముందు ఏం మాట్లాడుతున్నావ్? ఈ ఇంట్లో వాళ్ల గురించి నీకు తెలియదని కావ్య అనగానే.. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావ్? మీ వాళ్ళు మమ్మల్ని దోషులుగా చూస్తుంటే మా పరువు పోయిందని అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది.

ఆ తర్వాత మా కుటుంబాన్ని తిట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారని కావ్య తన పుట్టింటి వారిని అడుగుతుంది. అసలు ఎక్కడకి వెళ్ళావని అపర్ణ అడుగుతుంది. నేను చెప్తానంటూ సీతారామయ్య మధ్యలో కలుగుజేసుకొని.. తన కాపురం కుదుటపడితే ఒక రాత్రి గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకుందంట అని సీతారామయ్య చెప్తాడు.

ఆ విషయం చెప్పి వెళ్ళాలి కదా అని అపర్ణ అడుగగా.. పడుకున్న వాళ్ళని లేపి మరి చెప్పడం, ఎందుకని అనుకుని ఉంటుందని ఇందిరాదేవి అంటుంది. కాసేపటికి నేను ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్లినందుకు క్షమించండని కావ్య అందరికి చెప్తుంది. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి ఇద్దరు మమల్ని క్షమించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అదంతా విన్న రుద్రాణి, రాహుల్ కి ఇదంతా అబద్ధమని అన్పిస్తుందని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..