English | Telugu
రేస్ లో శివాజీ నెంబర్ వన్.. ఏడో స్థానంలో శోభా, చివరగా రతిక!
Updated : Nov 15, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా మారుతుంది. గత వారమంతా ఫ్యామీలీ వీక్ సాగింది. ఇక ఆ వీక్ 'ఓ బేబీ' టాస్క్ లో గెలిచిన అర్జున్, శివాజీలలో హౌస్ మేట్స్ శివాజీని కెప్టెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక గతవారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు.
ఇక ఈ వారం సోమవారం, మంగళవారం రెండు రోజులు నామినేషన్ ప్రక్రియ సాగింది. హౌస్ లో పది మంది ఉంటే శివాజీ, ప్రశాంత్ తప్ప మిగిలిన ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. అయితే బుధవారం నాటి మొదటి ప్రోమోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైనట్టుగా తెలుస్తుంది. హౌస్ లో " ఎవిక్షన్ ఫ్రీ పాస్" గురించి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మీలో మీరు డిసైడ్ చేసుకొని ఎవరు ఏ స్థానంలో ఉండాలనుకుంటారో బిగ్ బాస్ కి చెప్పండని అనగా.. శివాజీ, ప్రశాంత్, యావర్ మొదటి మూడు స్థానాలకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే హౌస్ లో ఆక్టివ్ గా లేని రతికకి పదో స్థానం ఇచ్చినట్లుగా, శోభా శెట్టికి ఏడవ స్థానం, అమర్ దీప్ కి నాల్గవ స్థానం ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే ఇలా హౌస్ మేట్స్ తమ అభిప్రాయాలు చెప్పేటప్పుడు రతిక-అర్జున్, అర్జున్-శోభాశెట్టి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది. శోభాశెట్టి ఇండివిడ్యువల్ గా ఆడుతుందని అందుకే ఏడవ స్థానం ఇస్తున్నాని అర్జున్ చెప్పగా.. శోభా ఏడుస్తూ ప్రియాంకకి చెప్పుకుంటుంది. మరి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వస్తుందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అయితే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికైతే వస్తుందో వారికి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం లభిస్తుంది. లేదా తనకి నచ్చిన ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అందుకే దీనికోసం హౌస్ మేట్స్ అంత పోటీపడుతున్నారు.