English | Telugu
యానిమల్ మూవీ కొందరికే అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!
Updated : Dec 6, 2023
బిగ్ బాస్ సీజన్-6 లో సాగిన ప్రేమ కథల్లో అర్జున్ కళ్యాణ్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీసత్యతో కలిసి లవ్ ట్రాక్ నడుపుతూ తన వెంటే ఉంటూ, ప్రతీ టాస్క్ లోను తనకి ఫేవరిజం చూపించడంతో.. అప్పట్లో వీరిద్దరి కలిస్తే చూడాలని బిగ్ బాస్ ప్రేక్షకులు భావించారు. అయితే బిగ్ బాస్ సీజన్-6 తర్వాత బిబి జోడి డ్యాన్స్ షో మొదలైంది. అందులోనైన శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ కలిసి నటిస్తారనుకుంటే .. వాసంతి, అర్జున్ జోడిలుగా వచ్చారు.
శ్రీసత్య, మెహబూబ్ కలిసి డ్యాన్స్ చేయడంతో అర్జున్ కాస్త జెలస్ ఫీల్ అయ్యాడు. మీరిద్దరు కలిసి ఒక సినిమా తీయండి అని అభిమానులు ఎప్పుడు అర్జున్ కి సందేశాలని పంపిస్తూనే ఉంటారు. అయితే శ్రీసత్య మాత్రం తనని ఎప్పటికప్పుడు వదిలించుకోవాలనే ప్రయత్నిస్తుంది. అయితే అర్జున్ కళ్యాణ్ తాజాగా " యానిమల్ " మూవీని థియేటర్లలో చూసాడంట. ఆ మూవీకి సంబంధించిన కొన్ని ఆలోచనలని సోషల్ మీడియా వేదికగా అర్జున్ కళ్యాణ్ పంచుకున్నాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'యానిమల్'. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగునాట కూడా అంచనాలకు మించిన వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తోంది.
ఈ సినిమాని చూసిన అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసాడు. అందులో.. ఇది చాలా డిస్టబ్ చేస్తుంది. ఇది సెన్సిటివ్ పీపుల్ కోసం కాదు. కొన్ని మూవీలలోని వాయిలెన్స్ ని ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. చంపడం, రేప్, ఒక సైకోయిక్ క్యారెక్టర్ చేసే పనులని చూడాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సమాజం అలాగే తయారైంది. కామ్ అండ్ కూల్ గా మంచిగా ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాంటివాటినే సమాజం ఇష్టపడుతుంది. రూడ్ గా ఉండటం, కేర్ లెస్ గా ఉండటం ఇప్పుడు చాలా సాధారమైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెరిగిపోతుంది. మనమే మాటలు అనడం, ఏమీ తెలియకుండా జడ్జ్ మెంట్ పాస్ చేయడం చేస్తుంటాం. ఇదంతా ఇప్పుడు జనాలకి అలవాటైంది. నా దృష్టిలో ఇది కొంతమందికే నచ్చుతుందని అర్జున్ కళ్యాణ్ తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు.