English | Telugu
పాప్ సింగర్ స్మిత హోమ్ టూర్!
Updated : Sep 6, 2022
పాప్ సింగర్ స్మిత హోమ్ టూర్ అద్దిరిపోయింది. ఒకసారి దాన్ని చూస్తే గనక ఇల్లా అది.. కాదు ఇంద్రభవనం అని అనకుండా ఉండరు ఎవ్వరూ. ఎంట్రన్సులోనే పూల తీగలు అందంగా స్వాగతం పలుకుతూ ఉంటాయి. అలాగే గోడకు వినాయకుడి రూపంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడముచ్చటగా ఉంది. ఇక కారిడార్ లో నటరాజ స్వామి విగ్రహం చాలా బాగా కొలువుదీర్చారు.. స్మిత టేస్ట్ సాంగ్స్ లోనే కాదు హౌస్ డెకొరేషన్ లో కనిపించింది.
చిన్న చిన్న మొక్కలతో ఏర్పాటు చేసిన గార్డెన్ ఇంకా అదిరిపోయింది. అలాగే ఇంట్లో పియానో కూడా కనిపించింది. ఇంకా ఇంట్లో లక్ష్మిజి పేరుతో ఒక ట్రెడిషనల్ లుక్ తో పాటు మోడరన్ లుక్ లో కనిపించే ఒక బొమ్మ అట్ట్రాక్ట్ చేసింది. దాన్ని జగదీష్ చింతాల డిజైన్ చేశారని చెప్పారు స్మిత. అలాగే ఎన్నో ఏళ్ళ నాటి యాంటిక్ పీసెస్ ని కలెక్ట్ చేసి దాచుకుంది స్మిత. ఇంట్లో ఎక్కడ చూసినా దేవుడి విగ్రహాలు కనిపిస్తూ మంచి పాజిటివ్ వైబ్స్ ని అందించేలా ఉంది. ఇలా స్మిత తన హోమ్ టూర్ లో ఎన్నో విషయాలు చెప్పారు.