English | Telugu
బిగ్‌బాస్ ఓటీటీ అతని చేతికా?
Updated : Dec 30, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 ముగిసింది. విజేతగా వీజే సన్నీ నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ సీజన్ ముగిసిన వెంటనే ఓటీటీ లో బిగ్‌బాస్ అనే వార్తలు మొదలయ్యాయి. ఓటీటీ బిగ్ బాస్ 24 గంటల నిడివితో వుంటుందని, దాని ఫార్మాట్ వేరేగా వుంటుందని ఇటీవల బిగ్‌బాస్ హోస్ట్, హీరో నాగార్జున వెల్లడించారు. అయితే దీనికి హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు? .. ఏమా కథ... కంటెస్టెంట్ లు ఎలా వుంటారు? .. ఎలా ఎంపిక చేస్తారు? .. అన్న విషయాలపై మాత్రం ఇంత వరకు ఎలాంటి స్పష్టతలేదు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ ఓటీటీ ఓంకార్ చేతుల్లోకి వెళ్లిందంటూ ప్రచారం జరుగుతోంది.
Also Read:అది విషపూరిత సర్పమే.. సల్మాన్ వెల్లడించిన షాకింగ్ డీటైల్స్!
అతనే ఓంకార్. OAK Entertainments పై ఆట, సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడీ, మాయాద్వీపం వంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమాలకి టీఆర్పీ రేటింగ్స్ కూడా రికార్డు స్థాయిలో నమోదు కావడం విశేషం. దీంతో బిగ్‌బాస్ ఓటీటీ బాధ్యతల్ని నిర్వాహకులు ఓంకార్ కు అప్పగించే అవకాశం వుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్‌బాస్ ఓటీటీ షో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా బిగ్‌బాస్ కొత్త సీజన్ కూడా మరో రెండు నెలల్లో అంటే ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది.
Also Read:జెనీలియాతో సల్మాన్ డాన్స్.. వీడియో వైరల్!
ఇక ఓటీటీ బిగ్‌బాస్ కోసం ఎంపిక చేయబోతున్న కంటెస్టెంట్స్ ఎవరంటే వీరేనంటూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్లు విన్న వాళ్లంతా అవాక్కవుతున్నారు. సీజన్ 5 సమయంలో ఉప్పల్ బాలు, కత్తర్ పాప, యాంకర్ శివ, బంజారాహిల్స్ ప్రశాంత్, టిక్ టాక్ దుర్గారావు వంటి పేర్లు వినిపించాయి. అయితే వీరినే బిగ్‌బాస్ ఓటీటీకి సెలెక్ట్ చేయాలని ఓంకార్ భావిస్తున్నారని, ఇదేం విచిత్రం బాబోయ్ అని వీక్షకులు అవాక్కవుతున్నారు. ఇదే నిజమైతే ఓటీటీ బిగ్‌బాస్ ఓ అరాచకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.