జెనీలియాతో సల్మాన్ డాన్స్.. వీడియో వైరల్!
on Dec 28, 2021

సల్మాన్ ఖాన్ 56వ బర్త్‌డే సందర్భంగా, జెనీలియా డిసౌజా షేర్ చేసిన ఒక పాత వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. డిసెంబర్ 27 సల్మాన్ బర్త్‌డే. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ వీడియోను షేర్ చేసింది జెనీలియా. ఆ వీడియోలో మ్యూజిక్‌కు అనుగుణంగా జెనీలియాతో కలిసి హుషారుగా డాన్స్ చేస్తున్నాడు సల్మాన్. ఆ వీడియో బట్టి చూస్తుంటే, అది ఆయన ఫామ్‌హౌస్‌లో తీసినదిగా కనిపిస్తోంది.
Also read: 3 రోజుల్లో హిందీ 'పుష్ప' వసూళ్లు రూ. 12 కోట్లు!
ఆ వీడియోను షేర్ చేసిన జెనీలియా, "అతిపెద్ద హృదయం ఉన్న మనిషికి హ్యాపీ బర్త్‌డే. May God bless you with loads of happiness, love and great health. We love you - Aaj Bhai ka birthday hai. @beingsalmankhan" అని రాసుకొచ్చింది. జెనీలియా ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణించి, బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి, నటనకు గుడ్‌బై చెప్పేసింది. హాయిగా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Also read: రాజమౌళి కాళ్లు మొక్కిన బాలీవుడ్ స్టార్ రణ్ బీర్
నిన్న తన ఫామ్‌హౌస్‌లో క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నాడు సల్మాన్. ఆదివారం అక్కడే పాముకాటుకు గురైన ఆయన చికిత్స తీసుకొని, రికవర్ అయ్యి ఫామ్‌హౌస్‌కు తిరిగొచ్చాడు. బర్త్‌డే పార్టీకి బాబీ డియోల్, నిర్మాత సాజిద్ నదియడ్‌వాలా, సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, నటులు నిఖిల్ ద్వివేది, మనీష్ పాల్ తదితరులు హాజరయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



