English | Telugu
సరిగమప v / s no .1 కోడలు
Updated : Jun 3, 2022
ఈ రెండు టీమ్స్ మధ్యన టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అలాగే కబాలి మూవీలో నటించిన సాయి ధన్సిక జీ సూపర్ ఫామిలీ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి ప్రదీప్ తో కలిసి డాన్స్ చేస్తుంది. తర్వాత కర్రసాము చేసి ఆడియన్స్ తో ఔరా అనిపించుకుంది. మద్యమద్యలో సోహైల్ కామెడీ పంచ్ లు అందరికీ నవ్వు తెప్పించాయి. ఇక ఈ షోలో "నాలోనే పొంగెను నర్మదా" అంటూ ప్రణవ్ కౌశిక్ అద్భుతమైన గాత్రంతో పాట పాడాడు.
ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ప్రణవ్ అతని ఫ్రెండ్ సుధాన్షు కలిసి డాన్స్ ఇరగదీస్తారు. ఆడియన్స్ అంతా లేచి వాళ్ళతో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారు. " ఓ చెలియా నా ప్రియా సఖియా " అంటూ చక్కని పాట పాడి డాన్స్ మాత్రమే కాదు సాంగ్స్ కూడా మస్త్ పాడతానని నిరూపించాడు సుధాన్షు . తర్వాత no . 1 కోడలు సీరియల్ లో అత్తా కోడళ్ళుగా ఆక్ట్ చేస్తున్న మధుమిత, సుధాచంద్రన్ ఇద్దరూ కలిసి చక్కని డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి అందరిని అలరించారు. ఫైనల్ గా సుధాచంద్రన్ గారి 50 ఏళ్ల జర్నీ పూర్తైన సందర్భంగా ఆమెను స్టేజి పై ఘనంగా సత్కరిస్తారు రెండు టీమ్స్ సభ్యులు. ఈ సెలెబ్రేషన్స్ కి సంబంధించి ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరలవుతోంది. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే జూన్ 5 th వరకు ఆగాల్సిందే.