English | Telugu
`నెం.1 కోడలు` లోకి సీనియర్ నటి కవిత ఎంట్రీ
Updated : Jun 2, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `నె.1 కోడలు`. గత కొంత కాలంగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. `మయూరి` ఫేమ్ సుధా చంద్రన్, సీనియర్ నటి కవిత, జై ధనుష్, మధుమత, క్రాంతి చంద్, సాక్షి శివ, బాలాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ గురువారం కొత్త మలుపు తిరిగబోతోంది. ఈ సీరియల్ లోకి కొత్తగా సీనియర్ నటి కవిత ఎంట్రీ ఇస్తోంది.
వాగ్ధేవి ముఖ్యమైన పని మీద టూర్ వెళ్లడానికి రెడీ అవుతూ వుంటుంది. ఇదే సమయంలో అత్త పాత్రలో సీనియర్ నటి కవిత తన మనవరాలితో ఎంట్రీ ఇస్తుంది. మధ్యలో కార్ ఆగిపోవడంతో రాహుల్ కి ఫోన్ చేసి పికప్ చేసుకోమని దబాయిస్తుంది. ఆమె మాటలకు హడలెత్తిపోయిన రాహుల్ వెళ్లి తనని ఇంటికి తీసుకొస్తాడు. కవితని చూసిన వాగ్ధేవి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని హడలి పోతుంది. తను ఇప్పుడు ఎందుకొచ్చిందంటూ లోలోన భయపడుతూ వుంటుంది.
ఇదే సమయంలో భోజనం చేద్దామని అంతా కవితని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ వున్న వంటకాలని చూసిన కవిత ఏంటే ఇదంతా అంటూ వాగ్ధేవిని నిలదీస్తుంది. ఉడికీ ఉడకని కూరలు.. కాలీ కాలని రొట్టెముక్కలు..ఇలాంటి తిండి తింటే నూరేళ్లు బ్రతకడం కాదు యాభై ఏళ్లలోనే అర్థ్రాయుష్సు అయిపోతుంది అంటుంది. ఈ వంటలు నచ్చకపోవడంతో `ఒకసారి నీ చేతి వంట రుచి చూడాలని వుంది` అంటుంది. దాంతో కంగారు పడ్డ వాగ్ధేవి నేనా అని ఆశ్చర్యంతో చూస్తుంది. అవును అంటూ కవిత `మిర్చీలు గిర్చీలు వాడకుండా..అన్నీ చేత్తో రుబ్బి.. కుదిరితే పాయసం కూడా చేయి అని వాగ్ధేవికి ఆర్ధర్ వేస్తుంది కవిత.. ఆ లిస్ట్ అంతా విని షాక్ అయిన వాగ్ధేవి తను చెప్పినట్టే వంట ప్రిపేర్ చేసిందా? ... ఆ తరువాత ఏం జరిగింది? .. కవిత .. వాగ్ధేవిని ఎలా ఆడుకుంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.