English | Telugu
బిగ్‌బాస్ సీజన్ 6 లో సిరి హన్మంత్ ప్రియుడు?
Updated : Jun 3, 2022
బిగ్‌బాస్ సీజన్ 6 కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఈ సారి సామాన్యులకు ప్రవేశాన్ని కల్పిస్తూ గోల్డెన్ ఆఫర్ ని ఇస్తున్నామని, త్వరలోనే తాజా సీజన్ ని ప్రారంభించబోతున్నామంటూ కింగ్ నాగార్జున తాజా ప్రోమోలో వెల్లడించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ పూర్తయిన వెంటనే సీజన్ 6కు సంబంధించిన ప్రోమోని విడుదల చేయడంతో ఈ సీజన్ లో హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారనే చర్చ మొదలైంది.
ఇప్పటికే పలువురు యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలు, టీవీ స్టార్స్, సినీ సెలబ్రిటీలు రాబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. కొంత మంది యూట్యూబ్ స్టార్ల పేర్లు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కింగ్ నాగ్ చెప్పినట్టుగా సామాన్యుల కోటాలో ఇరిద్దరికి ఛాన్స్ లభించే అవకాశం వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాసెస్ ముగిసినట్టుగా తెలుస్తోంది. యూట్యూబర్ హర్ష సాయి కూడా హౌస్ లోకి రాబోతున్నాడని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి అతని ఫ్యాన్స్ నెట్టింట అప్పుడే హంగామా మొదలు పెట్టారు కూడా.
ఇదిలా వుంటే తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఈ సీజన్ లో సిరి హన్మంత్ ప్రియుడు శ్రీహాన్ కు చోటు దక్కిందని తాజాగా ప్రచారం జరుగుతోంది. సీజన్ 5 లో సిరి హన్మంత్ టాప్ 5 దాకా వెళ్లి వెనుదిరిగింది. గత సీజన్ లో యూట్యూబర్ షణ్ముఖ్ తో కలిసి సిరి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మితిమీరిన హగ్గులతో వీరిద్దరు హౌస్ లో చేసిన అతి కారణంగా వీరిపై నెటిజన్స్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇంత నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా శ్రీహాన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా సిరికి అండగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు.
అలా అందరిని దృష్టిని ఆకర్షించిన శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఎంపికయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తొలి సీజన్ లోనే శ్రీహాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ప్రచారం జరిగినా అది జరగలేదు. అయితే సీజన్ 6 లో మాత్రం శ్రీహాన్ ఖచ్చితంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఫైనల్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన పూర్తి డిటైల్స్ ని స్టార్ మా వర్గాలు వెల్లడించే అవకాశం వుందని తెలిసింది.