Read more!

English | Telugu

అదే ఉంటే డేటింగ్ యాప్ లా చేసేస్తారు...మిగతా సగం జీవితం థ్రెడ్స్ తీసేసుకుంటుంది

ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా థ్రెడ్స్ అనే యాప్ ని విడుదల చేసింది. ట్విట్టర్‌కు పోటీగా  మెటా ఈ  కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఈ థ్రెడ్స్ యాప్ ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  ఆవిష్కరించారు. ఈ థ్రెడ్‌ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ టీమ్ డెవలప్ చేసింది.  ఈ థ్రెడ్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేసరికి సోషల్ మీడియా కళకళలాడిపోతోంది. ఎక్కడ చూసినా ఈ దారాలే  దారాలు. సోషల్ మీడియాలో ఏది వచ్చినా మన వాళ్లకు పండగే కదా..అలాగే ఇప్పుడు కూడా ఈ థ్రెడ్స్ తో ఫెస్టివల్  చేసుకుంటున్నారు సెలబ్రిటీస్...ఐతే ఈ థ్రెడ్స్ యాప్ గురించి నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన గోడును వెళ్లబోసుకున్నారు. "ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండాలి , స్నాప్ చాట్ లో యాక్టివ్ గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండాలి,

యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండాలి, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండాలి. ఇప్పటివరకు  ఇన్స్టాగ్రామ్ వాడు సగం జీవితం తీసేసుకున్నాడు. మిగతా జీవితాన్ని కూడా తీసేసుకోవడానికి  "థ్రెడ్స్" అనేది ఒకటి స్టార్ట్ చేసాడు. ఆ థ్రెడ్స్ యాప్ లో మాములుగా లేదండి ఉదయం నుంచి ఒకటే బ్యాటింగు, ఒకటే త్రెడ్డింగ్గు..నోటిఫికేషన్స్ వచ్చి చంపేస్తున్నాయి...ఆ దేవుడుకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి..ఎందుకంటే ఆ థ్రెడ్స్ అనే ఆప్ లో ఇప్పటివరకు డిఎం అనే ఆప్షన్ లేదు. లేకపోతే దాన్ని కూడా ఒక డేటింగ్ యాప్ లా చేసేస్తారు మనవాళ్ళు దయచేసి దాన్ని కొంచెం మంచిగా వాడతారని కోరుకుంటున్నా...." అని చెప్పాడు నిఖిల్ విజయేంద్రసింహా.. ఇక ఈ వీడియోకి "హానెస్ట్లీ త్రెడ్డింగ్...మీరు అంగీకరిస్తారా" అనే కాప్షన్ పెట్టారు. "యాక్టివ్ గా ఉండమని ఎవరు అడిగారు సర్..ఉండొద్దు...ఎందుకు మీరు డిఎం గురించి ఇన్స్టాగ్రామ్ వాళ్లకు గుర్తుచేతున్నారు..వాళ్ళు ఈ వీడియో చూసి డిఎం పెడితే..థ్రెడ్స్ బ్యాటింగ్ ఉండేది..కుట్లు, అల్లికలే ఉంటాయి. " అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.