English | Telugu

ఇప్పటివరకు ఎనిమిది మౌంటెయిన్స్ అధిరోహించాను..


సూపర్ క్వీన్ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమోలో లేడీస్ అంత స్పోర్ట్స్ థీమ్ సందర్భంగా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని వచ్చేసారు. స్పోర్ట్స్ థీమ్ కాబట్టి "ఏం గేమ్స్ వచ్చు" అని ప్రదీప్ అడిగేసరికి "ఆ మీనా కట్టా మీనా" అనే గేమ్ ఆడి చూపించారు. ఇన్ని కోట్లు ఖర్చుబెట్టి ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి షో చేస్తే ఆ మీనా అని ఆడుకుంటారా అని కామెడీ చేసాడు ప్రదీప్. "దొంగ -పోలీస్ ఆటంటే ఇష్టం అని పవిత్ర చెప్పేసరికి అందుకేనా నిన్న సైరన్ వినిపించేసరికి సెట్ లోంచి లేచి పారిపోతున్నావ్" అంటూ నవ్వించాడు. ఇక వీళ్ళ మధ్యన చాలా ఇంటరెస్టింగ్ గేమ్స్ ఆడించారు. అలాగే ఒక ఇంటరెస్టింగ్ పర్సనాలిటీని ఈ షోకి ఇన్వైట్ చేశారు.

ఆమె ఎవరో కాదు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన యాదాద్రి జిల్లాకి చెందిన‌ పడమటి అన్వితారెడ్డి ఈ షోకి వ‌చ్చారు. ఆమెను సూపర్ క్వీన్స్ అంతా సత్కరించారు. "ఇప్పటివరకు ఎనిమిది మౌంటెయిన్స్ అధిరోహించాను.. అలాగే నాలుగు ఇంటర్నేషనల్ మౌంటెయిన్స్ కూడా పూర్తి చేసాను..ఇంకా పూర్తి చేయాల్సినవి మూడు ఉన్నాయి" అని చెప్పారామె ..తర్వాత వాటర్ లో ఆపిల్స్ వేసి చేతులు వాడకుండా వాటిని నోటితో తీసి పక్కనే ఉన్న టబ్బు లోకి వేసే ఒక గేమ్ ఆడించారు. తర్వాత బాల్ అండ్ బాట్ గేమ్ పెట్టేసరికి అందరూ తమకు వామిటింగ్ ప్రాబ్లమ్ అని, లోబీపీ అని, ఇంకొకళ్ళు హైబిపి అని చెప్పి తప్పించుకునేసరికి "ఎవర్రా ఏజ్ బార్ ఐన వాళ్ళను తీసుకొచ్చి నిల్చోబెట్టారు" అని కామెడీ చేసాడు ప్రదీప్. ఇక ఈ గేమ్ లో ఇద్దరు సూపర్ క్వీన్స్ ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఇక సూపర్ క్వీన్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి వీళ్ళతో ఆట ఆడించేసరికి వాళ మధ్య క్లాషెస్ వచ్చాయి. ఇలా సూపర్ క్వీన్ షో నెక్స్ట్ వీక్ మంచి గేమ్ థీమ్ తో అలరించబోతోంది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.