English | Telugu
రోహిత్ ని ఎలిమినేట్ చేసిన కార్తికేయ హీరో నిఖిల్!
Updated : Dec 19, 2022
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజి మంచి కలర్ ఫుల్ గా తయారు చేశారు. టాప్ 5 లో ఉన్న ఒకరిని ఎలిమినేట్ చేయమంటూ గెస్ట్ గా వచ్చిన నిఖిల్ ని కింగ్ నాగ్ హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ వేదిక మీద నిఖిల్ కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ గురించి, 18 పేజెస్ రిలీజ్ గురించి సరదాగా ముచ్చటించారు. కార్తికేయ 2 అంత పెద్ద విజయం సాధించినందుకు నాగార్జున నిఖిల్ ని అభినందించారు.
చాలా మంది అప్ కింగ్ యాక్టర్స్ కి కింగ్ నాగ్ ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పారు నిఖిల్. ఇక అప్పుడు నాగార్జున నిఖిల్ కి ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్తూ రెడ్ హాట్ ఒకదాన్ని నిఖిల్ చేతిని ఇచ్చి పంపించారు.
ఇక నిఖిల్ హౌస్ లోకి వెళ్లి అందరితో సరదాగా ఆడిపాడారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు టాప్ 5 కంటెస్టెంట్స్ ని తెగ టెన్షన్ పెట్టాడు. చివరికి నిఖిల్ రెడ్ హ్యాట్ ని రోహిత్ తలపై పెట్టేసరికి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. రోహిత్ ఎలిమినేట్ అయినప్పుడు అతడి తల్లిదండ్రులు, భార్య మెరీనా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక నిఖిల్ అతడిని వేదిక మీదకు తీసుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో అద్భుతమైన జర్నీ చేసినందుకు నాగార్జున రోహిత్ ని అభినందించారు.