English | Telugu
బిగ్ బాస్ వేదికపై బయటపడిన రవితేజ..నాగార్జున మధ్యన ఉన్న సీక్రెట్
Updated : Dec 19, 2022
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ షోకి "ధమాకా" మూవీ జోడి మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల బిగ్ బాస్ వేదికకు మీదకు వచ్చారు. రవితేజ ఖాతాలో ఉన్న హిట్స్ గురించి ఫ్లాప్స్ గురించి మాట్లాడుతో మధ్యమధ్యలో సెటైర్లు వేశారు నాగ్. ఇక శ్రీలీల అందం గురించి తెగ పొగిడేశారు. ఇక ఈ వేదిక మీద రవితేజ లైఫ్ కి సంబంధించి ఒక సీక్రెట్ కూడా రివీల్ చేశారు.
అదేంటంటే తాను మూవీ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలు పెట్టింది నాగార్జున గారి మూవీతోనే అని రవితేజ అన్నారు. ఆయన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ తన కెరీర్ ని స్టార్ట్ చేసినట్లు చెప్పారు. అలా తనకు ఫస్ట్ రెమ్యునరేషన్ నాగార్జున గారు చెక్ రూపంలో ఇచ్చారు అంటూ రవితేజ చెప్పారు. ఆ చెక్ ని దాచుకుందాం అనుకున్నా కానీ ఖర్చయిపోయిందన్నారు. తనను నాగార్జున గారు ఎంతో ఎంకరేజ్ చేసేవారని చెప్పుకొచ్చారు. చాలా విషయాల్లో ఆయన నాకు ఇన్స్పిరేషన్ అంటూ రవితేజ నాగ్ గురించి చెప్పారు.
ఇక శ్రీలీల హౌస్ లో ఉన్న కీర్తితో కన్నడలో మాట్లాడి సర్ప్రైజ్ చేసింది. శ్రీలీల కన్నడలో మాట్లాడుతుంటే నాగ్, రవి తేజ అర్థం కాక తలలు బాదుకున్నారు.