English | Telugu
రేవంత్ గెలుపుకు కారణం అతనే!
Updated : Dec 19, 2022
105 రోజులు సాగిన బిగ్ బాస్ సీజన్-6 నిన్నటితో ముగిసింది. 'ఎంటర్‌టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్' అనే ట్యాగ్ లైన్ తో మొదలై, విశేషమైన ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సీజన్ ప్రేక్షకులతో ఎన్నో జ్ఞాపకాలను పంచుకుంది.
మొదట 21 మందితో మొదలైన బిగ్ బాస్-6.. కంటెస్టెంట్స్ చేసిన అల్లరి, గొడవలు, ఎమోషన్స్, వినోదం.. ఇలా ఎన్నింటినో ప్రేక్షకులకు అందించింది. ఆయితే శుక్రవారమే గ్రాండ్ ఫినాలే రేస్ నుండి శ్రీసత్య ఎలిమినేషన్ అయ్యి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన వాళ్ళు టాప్-5. వీరిలో నుండి మొదట రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. 'కార్తికేయ-2' ఫేమ్ నిఖిల్ హౌస్ లోకి వచ్చి, రోహిత్ ని బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యి వచ్చాడు.
ఇంకా హౌస్ లో కీర్తి, రేవంత్, శ్రీహాన్, ముగ్గురు ఉన్నప్పుడు రవితేజ సూట్ కేస్ తో హౌస్ లోకి వెళ్లి వారికి మనీ ఆఫర్ ఇచ్చాడు. కానీ ఎవరు అంగీకరించలేదు. ఇక "ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్ లో ఉన్నారో వారిని తీసుకొచ్చేయ్" అని నాగార్జున చెప్పేసరికి, రవితేజ మాట్లాడుతూ " ప్రతీ మనిషికి కీర్తి ప్రతిష్ఠలు కావాలి" అని చెప్పి కీర్తిని హౌస్ నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇక హౌస్ లో శ్రీహాన్, రేవంత్ ఇద్దరే మిగిలారు. వారిని బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకురావడానికి.. స్వయంగా నాగార్జునే గోల్డెన్ సూట్ కేస్ తో హౌస్ లోకి వచ్చాడు. ఇక లోపలికి వచ్చాక ఇద్దరికీ మనీ ఆఫర్ చేసాడు. "అందులో 40లక్షలు ఉన్నాయి. అవి రన్నర్ కి.. మీ ఇద్దరిలో ఎవరికి కావాలో డిసైడ్ చేసుకోండి" అని చెప్పాడు. అయితే ఈ ఆఫర్ కి శ్రీహాన్ తీసుకుంటున్నట్టు ఒప్పుకొని రన్నర్ గా మిగిలాడు. రేవంత్ విజేతగా నిలిచాడు.