English | Telugu
జూన్ 13 నుంచి న్యూ సీరియల్ 'కోడళ్ళు మీకు జోహార్లు'
Updated : Jun 6, 2022
జీ తెలుగులో ప్రసారం కాబోయే కొత్త సీరియల్ "కోడళ్ళు మీకు జోహార్లు " టైమింగ్, లాంచింగ్ డేట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 గంటలకు రాబోతోంది. దీపావళి కొందరిని విడదీసింది.. కొందరిని కలిపింది. ఐతే అందర్నీ విడదీసిన దీపావళి 14 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుతుందా.. సంతోషాన్ని పంచుతుందా చూడాల్సిందే అనే సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
హీరోగా నాగార్జున యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు 'కస్తూరి' సీరియల్ లో పరం అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సీరియల్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్స్ గా దుర్గశ్రీ, కౌస్తుభ మణి నటిస్తున్నారు. దుర్గశ్రీ ఇది వరకు ఉదయ టీవీలో ప్రసారమైన 'నేత్రావతి' అనే సీరియల్ లో నటించారు. ఇక కౌస్తుభ మణి కలర్స్ కన్నడలో 'నన్నరాసి రాధే' అనే సీరియల్ లో ఇంచరా అనే పాత్రలో యాక్ట్ చేశారు.
ఈ సీరియల్ లో ఇంకా చరణ్ రాజ్ ఒక పాత్రలో కనిపించనున్నాడు. అతను 'వదినమ్మ' సీరియల్ లో భరత్ అనే పాత్రలో యాక్ట్ చేశారు. 'నిన్నే పెళ్ళాడతా', 'స్వర్ణ పేలెస్' అనే సీరియల్స్ లో నటించిన జయరాం పవిత్ర ఈ సీరియల్ లో అత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సీరియల్ లో మెయిన్ గా ఆనాటి అందాల నటి రాగిణి తల్లి కేరెక్టర్ లో కనిపించనున్నారు. ఈమె గురుంచి చెప్పాలంటే ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రేమ్ సాగర్ ఒక రోల్ లో నాగార్జునకు తల్లి పాత్రలో జానకి వర్మనటిస్తున్నారు.