English | Telugu
రష్మీ తెలుగుకి ఆడియన్స్ కి మైండ్ పోయింది
Updated : Jun 6, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీకి పర్మనెంట్ యాంకర్ లు లేరని చెప్పకనే చెప్పాడు ఆది. ముందు ఒకతను వచ్చాడు వెళ్ళిపోయాడు, తర్వాత సుధీర్ వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వొచ్చావ్. నువ్వన్నా పర్మనెంట్ గా ఉంటావో లేదోనని తెలీక ఈ ప్రమాణ స్వీకారం అంటూ శ్రీదేవి షో గురుంచి సీక్రెట్ చెప్పాడు.
వెంటనే కొంతమంది మధ్యలో రష్మీ ప్రమాణ స్వీటుకారం చేసింది. ఈ షోని మందుకు తీసుకెళతాను. అంటూ మొదలుపెట్టేసరికి ఆది బూందీ, లడ్డు లేదా..ఏ బార్ కి తీసుకెళ్తావ్ అంటూ పంచ్ వేసేసరికి రష్మీ ముఖం మాడిపోతుంది. "రష్మీ అనే నేను శాషణం ద్వారా నిర్మతమైన భూదేవి డ్రామా కంపెనీ పట్ల న్యాయబద్దకంగా ఉంటానని., విశ్వక్ సేన్ ని చూపిస్తానని, కామెడీకి పెద్ద పైట వేస్తానని, భయం కానీ, పక్షవాతం కానీ లేకుండా చూసుకుంటానని మాటిస్తున్నా " అంటూ చెప్తుంది.
అంటే నువ్వు కూడా భూదేవి డ్రామా కంపెనీ అనే షోకి వెళ్ళిపోతున్నావా అంటూ ఆది పంచ్ వేస్తాడు. నువ్వెప్పుడూ బద్దకంగా ఉంటావ్ గాని అది న్యాయబద్దంగా అని సరిచేస్తాడు. విశ్వక్ సేన్ కి కాదు తల్లి చూపించేది విశ్వసనీయతను అంటూ చెప్పేసరికి రష్మీ నవ్వేస్తుంది. కామెడీకి పైట వేస్తావా లంగా ఓణీ వేసి సమత్త బంతి చేయవా అంటూ ఫన్ క్రియేట్ చేసాడు. కానీ ఆది ఇలా అనకుండా ఉండాల్సింది కదా అంటున్నారు లేడీ ఆడియన్స్. డైలాగ్స్ కొంచెం చూసుకుని రాసుకోవాలి కదా అన్ని మాటలు ఫన్ క్రియేట్ చేయలేవు అని అంటున్నారు. అమ్మా రష్మీ పక్షవాతం, పెరాలిసిస్ ఏమిటమ్మా ఇవన్నీ అంటూ రాంప్రసాద్ పక్షపాతం అని చెప్పిస్తాడు.
ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రష్మీ స్కిట్ వైరల్ అవుతోంది. కానీ ఇక్కడో విషయం గమనిస్తే ఎవరు కౌంటర్ వేసినా వెంటనే రీకౌంటర్ ఇచ్చే రష్మీ మాత్రం ఈ వారం ఎపిసోడ్ లో ఆది కానీ, ఆటో రామ్ ప్రసాద్ ఏం అన్నా నవ్వుతూ ఊరుకుంది తప్ప ఒక్క రివర్స్ పంచ్ అనేది వేయలేదు. ఐతే రష్మీ సుధీర్ అడుగుజాడల్లో నడుస్తుందేమో..ఎంతైనా బెస్ట్ పెయిర్ ఆన్ స్మాల్ స్క్రీన్ కదా, బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు సుధీర్ అంటున్నారు ఆడియన్స్. సుధీర్ చెప్పినట్టే రష్మీ సైలెంట్ గా ఉంటూ జనాల్లో క్రేజ్ తెచ్చుకోవడానికి తంటాలు పడుతుందేమో అనిపిస్తోంది. ఏదైమైనా నెక్స్ట్ వీక్ షో వరకు అన్నా రష్మీ ఉంటుందా..ఇంకో కొత్త యాంకర్ వస్తుందా ? అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి.