English | Telugu

పృథ్వీతో కలిసి బయటకొస్తానన్న విష్ణుప్రియ.. నెటిజన్లు షాక్!

బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం నాడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఇందులో భాగంగా సెలెబ్రిటీలు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి సందడి చేశారు. సింగర్ సమీరా భరద్వాజ్ వచ్చి కంటెస్టెంట్ల మీద స్పెషల్ పేరడీ పాటలు పాడింది. చివరకి హైపర్ ఆదితో ఓ సెగ్మెంట్ పెట్టేశాడు. తన స్టైల్లో కంటెస్టెంట్లను ఆడుకున్నాడు ఆది. విష్ణుప్రియకి మంచి సలహాలు ఇచ్చాడు.

ప్రతీ సీజన్‌లో హైపర్ ఆది వచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరు మీద కౌంటర్లు వేస్తూ హింట్లు ఇస్తుంటాడు. ఈసారి కూడా ఆది అలానే కంటెస్టెంట్లకు మంచి సలహాలు ఇచ్చాడు. వైల్డ్ కార్డులు రాక ముందు.. బాహుబలి-1, వైల్డ్ కార్డుల ఎంట్రీ తరువాత బాహుబలి-2 లా ఉందని, ఈ సీజన్ పెద్ద హిట్ అయిందని చెప్పుకొచ్చాడు. సోనియా, నిఖిల్ పృథ్వీ ప్రేమ దేశం చూపించాడు. నిఖిల్.. ఏక్ నిరంజన్ చూపించాడు. ఆ తర్వాత విష్ణు, పృథ్వీ.. ప్రేమించుకుందాం సినిమా చూపించారని.. మధ్యలో నయని దూరి.. ఇంట్లో ఇళ్లాలు వంటింట్లో ప్రియురాలు చూపించిందని ఆది అన్నాడు.

సీఎం, డీసీఎంలు పెద్ద పెద్ద స్పీచులు ఇవ్వలేదు కానీ నువ్వు మాత్రం మెగా చీఫ్ అయ్యేందుకు పెద్ద స్పీచ్ ఇచ్చావ్. అంత:కరణశుద్ది అంటూ పెద్ద పెద్ద పదాలు వాడావ్.. విష్ణుతో పాటుగా పృథ్వీ కూడా నిలబడాలి.. మీ ఇద్దరి పెయిర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.. విష్ణుప్రియ నవ్వులకు కుర్రాళ్లు భయపడుతున్నారు.. కాస్త మెల్లిగా నవ్వు. పతివ్రత, పుణ్య స్త్రీ, రాక్షసిదాన అనే పదాలన్నీ ఇప్పుడు నీ వల్లే ఫేమస్ అవుతున్నాయి.. పాత సినిమాల్లో వినిపించే టైటిల్, డైలాగ్స్‌తో ఈ పదాలు ఫేమస్ అయ్యాయి. నాగార్జున గారు ఉంటే ఆటకు హాయ్, పృథ్వీకి బై. నాగార్జున గారు లేకపోతే.. ఆటకు బై పృథ్వీకి హాయ్ చెబుతున్నావ్.. ఇంత వరకు బొమ్మరిల్లు ఫాదర్‌ను చూశాం.. కానీ నువ్వు మాత్రం బొమ్మరిల్లు లవర్. ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో అన్నీ నువ్వే పృథ్వీకి చెబుతున్నావ్.. ఇప్పటికీ నీ కన్ను పృథ్వీ మీదే ఉంది.. పృథ్వీని ప్రేమిస్తే.. పృథ్వీ మాత్రమే నిన్ను ప్రేమిస్తాడేమో.. కానీ ఆటని కూడా ప్రేమిస్తే.. ప్రేక్షకులందరూ నిన్ను ప్రేమిస్తారు.. బయట ఎలా ఉందో.. ఇంట్లో కూడా అలానే ఉంది.. చాలా చెప్పా.. నత్తి బ్రెయిన్‌కు అర్థమైతే.. సంతోషం అని అన్నాడు. నువ్వు బయటకు టైటిల్‌తో వస్తావా.. లవర్‌తో వస్తావా అని బయట నీ తమ్ముళ్లు వెయిటింగ్ అని ఆది అడుగుతాడు. రెండింటితో వస్తానని విష్ణు చెప్తుంది. మళ్లీ తన ప్రేమను వదిలి పెట్టడం లేదు. అసలు విష్ణు అర్థం చేసుకునే మూడ్‌లోనే లేనట్టుగా కనిపిస్తోంది. పృథ్వీతో లవ్ ట్రాక్ కి బ్రేక్ ఇస్తేనే విష్ణుప్రియ ఆట మెరుగుపడుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.