English | Telugu

అవినాష్ ఎలిమినేషన్.. షాక్ లో కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ద్చారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఎలిమినేషన్ అయ్యాడు.‌ ఇది ఎవరు ఊహించనది. మొన్నటి ఎపిసోడ్ లో రాత్రి అవినాష్ కి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో అతను మెడికల్ రూమ్ కి వెళ్ళాడు.

మెడికల్ రూమ్ లో డాక్టర్లు అన్ని టెస్ట్ లు చేసి అవినాష్ కి కడుపులో ఏదో ప్రాబ్లమ్ ఉందని తేల్చేశారు‌.‌ ఇక అవినాష్ అదే విషయం హౌస్ లోకి వచ్చి తోటి హౌస్ మేట్స్ తో చెప్పాడు. ఇక అందరు ఏదో ప్రాంక్ అనుకున్నారు. కానీ నిజంగానే అవినాష్ అందరికి బై చెప్పేసి మెయిన్ గేట్ నుండి బయటకి వెళ్లిపోయాడు. ఇక హౌస్ లోని విష్ణుప్రియ, రోహిణి, హరితేజ అందరు ఏడ్చేస్తున్నారు.‌ ఇది ఆదివారం నాటి ఎపిసోడ్ చివరలో వేయడంతో ఫుల్ వైరల్ గా మారింది.

అవినాష్ హౌస్ లో మోస్ట్ ఎంటర్‌టైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సందర్భాలలో అవినాష్- రోహిణి కలిసి చేసిన కామెడీ సూపర్ హిట్ అయ్యింది. ‌ఇక అవినాష్ ఇలా హెల్త్ పరంగా బయటకు రావడం బిబి ఆడియన్స్ కాస్త నిరాశమే మిగులుస్తుంది. అయితే అవినాష్ మళ్ళీ హౌస్ లోకి వస్తాడా రాడా అనేది మెడికల్ రిపోర్ట్స్ వచ్చాకే తెలుస్తుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.