English | Telugu

ఆ పుష్ప పాటను ఆపు...అల్లు అర్జున్ కూడా అన్ని సార్లు వాడలేదు

బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో వెళ్లి టైటిల్ ని గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పటికీ జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఐతే తనకు వచ్చిన ప్రైజ్ అమౌంట్ ని రైతులకు పంచుతానని చెప్పి ఇవ్వలేదేమిటి అంటూ అందరూ సోషల్ మీడియాలో అడిగేసరికి కొంతమందికి శివాజీ, భోలే షావలి ఆధ్వర్యంలో ఇచ్చాడు. ఇక ఇప్పుడు కొన్ని రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తాడని అందుకే ఆటిట్యూడ్ మొత్తం చేంజ్ చేశాడంటూ వైట్ అండ్ వైట్ వేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది.

ఇప్పుడు ప్రశాంత్ సెలబ్రిటీస్ ని వదలకుండా ఒక్కొక్కరిగా కలుస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ స్పోర్ట్స్ తెలుగుకు కూడా వెళ్లి ఇంటర్వ్యూ కూడా ఇచ్చి వచ్చాడు. ఐతే ఇలా సెలబ్రిటీస్ ని కలుస్తూ ఉండేసరికి నెటిజన్స్ కూడా ప్రశాంత్ ని ఘాటుగానే విమర్శిస్తున్నారు. రీసెంట్ గా ఆయన బుల్లితెర, వెండితెర నటుడు సమీర్ ని కలిసి తగ్గేదేలే అన్న ఒక సిగ్నేచర్ స్టైల్ తో దిగిన ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు ప్రశాంత్. అది చూసిన నెటిజన్స్ "అయ్యా ప్రశాంత్ నువ్వు రైతుల చుట్టూ వుంటావు అనుకున్నాం కానీ సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్నావు...ఈ సమయంలో నువ్వు తిరగాల్సింది సెలబ్రెటీల చుట్టూ కాదు కష్టకాలంలో ఉన్న రైతుల చుట్టూ... కష్టకాలంలో ఉన్న రైతులకు సహాయం చేస్తే బాగుంటుంది...అయ్యా ప్రశాంత్ ఫొటోస్ పెట్టు కానీ ఆ పుష్ప సాంగ్ పెట్టింది చాలయ్యా. అల్లు అర్జున్ కూడా అన్నిసార్లు వాడుకోలేదు ఆ సాంగ్ ని " అని తెగ తిడుతున్నారు. జై జవాన్, జై కిసాన్ అని అంటూనే మరో వైపు పుష్ప పాటలు, పుష్ప స్టైల్ తో, మళ్లొచ్చినా అంటే తగ్గేదేలే అంటూ హడావిడి చేస్తూ ఉంటాడు. గత బిగ్ బాస్ సీజన్ లో సోహైల్ ఒక "కథ వేరే ఉంటది" అంటూ ఒక లైన్ ని వాడాడు. ప్రశాంత్ కూడా జనాల్లోకి వెళ్ళడానికి అలాంటిదే ఫాలో అవుతున్నాడు అంటూ కూడా నెటిజన్స్ కూడా గతంలో కామెంట్స్ చేశారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..