English | Telugu
అష్షు "నెక్స్ట్ జనరేషన్ సన్నీలియోన్" అంటున్న నెటిజన్స్
Updated : Aug 9, 2022
అష్షు రెడ్డి ఈ పేరు అందరికీ తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా అందరికీ తెలిసింది. బిగ్ బాస్ హౌస్ లో అష్షు రెడ్డి, పునర్నవి, రాహుల్ వీళ్ళ మధ్య ప్రేమ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా మంచి ఫేమస్ కూడా అయ్యింది. రాహుల్ యూట్యూబ్ సింగర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి బిగ్ బాస్ షో - 3 తో మస్త్ ఫేమస్ అయ్యాడు. ఫైనల్ లో రాహుల్ సిప్లిగంజ్ గ్లామరస్ యాంకర్ శ్రీముఖితో పోటీపడి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. పునర్నవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక అష్షు రాహుల్ తో రిలేషన్ షిప్ కంటిన్యూ చేసింది. బయట కూడా వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రాహుల్, అష్షు కలిసి దిగిన ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ట్యాగ్ తో పాటు రెడ్ హార్ట్ ఎమోజిని కూడా పెట్టేసాడు.
ఐతే అష్షు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సీక్రెట్ ప్లేసెస్ లో వేయించుకున్న టాటూస్ చూపిస్తూ, బాత్ టబ్ లో స్నానం చేస్తూ, బీచ్ లో పొట్టి డ్రెస్సుల్లో అల్లరి చేస్తూ మొత్తానికి హాట్ పీస్ అనిపించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు రాహుల్, అష్షు ఫ్రెండ్షిప్ డే పిక్ కి ఒక నెటిజన్ " నెక్స్ట్ జనరేషన్ సన్నీ లియోన్" అంటూ ఒక హాట్ కామెంట్ పోస్ట్ చేసాడు. ఇంకా కొంత మంది నెటిజన్స్ మాత్రం మీ రిలేషన్ ని ఫ్రెండ్షిప్ అంటారా అంటూ వీళ్ళను బాగా తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.