English | Telugu
అరియానా అందాల విందు... అందుకే ఈ పరిస్థితి!
Updated : Dec 22, 2023
నీకొక విషయం చెప్పాలి పల్లవి ప్రశాంత్ గెలిచాడు.. ఇదేంట్రా బాబు ఓవైపు అతను జైలుకి వెళ్ళి, ఎప్పుడు వస్తాడో అని అందరు ఎదురుచూస్తుంటే ఇదేంట్రా బాబు అనుకుంటే కాదు. ఇది ఒక పోస్ట్ కి నెటిజన్ చేసిన కామెంట్. ఏంటా పోస్ట్? అసలెంటా పోస్ట్ అంటే.. అరియానా గ్లోరీ.. ఒక హాట్ ఫోటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కి ఓ నెటిజన్ కామెంట్ గా పల్లవి ప్రశాంత్ గెలిచాడని చేశాడు. ఇలా అతను అనడానికి ఓ కారణం ఉంది.
యాంకర్‌గా కెరీయర్ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియాన గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చిన వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియాన సొంతం చేసుకుంది.
అరియాన అప్లోడ్ చేసిన ఫోటోలకి పల్లవి ప్రశాంత్ గెలిచాడనేదానికి సంబంధమేంటంటే.. అరియాన ఫ్రెండ్ అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్ళిన నుండి అతనికి సపోర్ట్ చేయమని తెగ పోస్ట్ లు చేసింది. ఇక అతను గెలవలేదు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు అని చెప్పడానికి తనని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. పొట్ట లోపలకి లాక్కొనొ ఫోటో దిగింది, చివరికి బట్టలు లేకుంటా ఫోటోలు పెట్టేలా ఉన్నావ్ కదా, నువ్వు సపోర్ట్ చేసినందుకు అమర్ దీప్ ఓడిపోయాడు, "అసలు నువ్వు సెలబ్రిటీ ఎలా అయ్యావ్.. నీలో ఏ ట్యాలెంట్ ఉంది. కామెడీ చెయ్యలేవు, యాక్టింగ్ రాదు, అందం లేదు, అయిన ఇండస్ట్రీ లో ఉంటున్నావ్ ఇది మా కర్మ" అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్లని చూసిందా అరియానా, చూస్తే రిప్లై ఇవ్వాలి కదా.. మరి తను ఈ కామెంట్లని చూస్తే ఎలా స్పందిస్తుందో చూడాలి.