English | Telugu

నువ్వు దరిద్రంగా ఉంటావ్.. ఆదిపై నయని కామెంట్స్ వైరల్!

ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ షో ఇప్పుడు సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కింగ్ మూవీ సాంగ్‌తో గిటార్ ప్లే చేస్తూ వచ్చి డాన్స్ చేశాడు అఖిల్ సార్థక్.

ఇక అఖిల్ డాన్స్ చూసి చాలా బాగుంది అంది పూర్ణ.. "నాకు అఖిల్ డాన్స్ అంటే చాలా ఇష్టం" అని ఆది సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక ఈ షోలో నయని పావనిని టీజ్ చేయకుండా ఉండడు ఆది. అదే ధోరణిలో "ఎప్పుడూ లేనంత దరిద్రంగాఉంది ఈ రోజు నయని" అని కామెంట్ చేసాడు. "నువ్వైతే రోజూ దరిద్రంగానే ఉంటావ్" అని కౌంటర్ ఇచ్చిపడేసింది నయని.

తర్వాత జోడీస్ టీం లీడర్శ్వేత వచ్చి అద్దిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఫైనల్‌గా ఆది స్టేజి మీదకు వచ్చి "వచ్చే వారం ఎపిసోడ్‌లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ నాదే" అని చెప్పాడు.

ఇక ప్రదీప్ కొంటెవాడని ఆల్రెడీ తెలుసు కదా! "నెక్స్ట్ వీక్ డాన్స్‌కి సంబంధించి కమింగ్అప్ ఏమన్నా ఇవ్వొచ్చుగా" అనేసరికి ఆది ఒక రెండు స్టెప్పులేసి స్టైల్ కొట్టాడు. మరి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్‌కి ఫైనల్స్‌కి ఏ జోడి వెళ్తుందో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయాలి.