English | Telugu
సదాకి లిప్ లాక్ ఇచ్చిన నాటీ నరేష్!
Updated : Jun 4, 2022
నాటీ నరేష్'ఎక్స్‌ట్రా జబర్దస్త్'లో ప్రతీ స్కిట్ లో తనని తానూ మెరుగుపరుచుకుంటూ కొత్త కొత్త పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని కదలనివ్వకుండా చేస్తున్నాడు. ఇంటికి తాళం వేసినా వేయకపోయినా సెల్ కి తాళం వేయకపోతే కాపురాలు కూలిపోతాయనే కాన్సెప్ట్ తో కొత్త స్కిట్ ట్రై చేసాడు. ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో కార్లు ఎలా మనుషుల్లా మాట్లాడతాయో ఈ స్కిట్ లో కూడా సెల్ ఫోన్, టీవీ అన్ని మాట్లాడతాయన్నమాట. ఇందులో సెల్ ఫోన్ వేషంలో నరేష్ వస్తాడు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ స్కిట్ కి మంచి మార్క్స్ పడ్డాయి. ఎందుకంటే చాలా మంది ఇళ్లల్లో భర్తలు తమ సెల్స్ ని భార్యలు ఎక్కడ చూసేసి తమ సీక్రెట్స్ తెలుసుకుంటారో అని సెల్స్ ని కూడా తమతో పాటు బాత్ రూమ్ లోకి తీసుకెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇదే కాన్సెప్ట్ తో మంచి స్కిట్ రాసుకుని నాట్ బాడ్ అనిపించారు కెవ్వు కార్తీక్, నాటీ నరేష్. కార్తిక్ సెల్ పోవడంతో వెతుకుతూ ఉంటాడు. ఇంతలో నరేష్ సెల్ ఫోన్ వేషంలో వచ్చి కార్తిక్ ని చితక్కొడతాడు. ససెల్ ఫోన్ ఉన్నది మాట్లాడుకోవడానికి, మెసేజ్ చేసుకోవటానికి అన్నప్పుడు బాత్ రూమ్ లోకి తీసుకెళ్లడమేంట్రా.. ఆ బాత్రూమ్ వాసన నేను భరించాలా?స అంటూ నాటీ నరేష్ అంటాడు. సీరియస్ గా 'ప్రపంచంలో ఉన్న అందరికీ వార్నింగ్ ఇస్తున్నా.. సెల్ కి లాక్ వేయండి. లేదంటే కాపురాలు మటాష్' అంటూ ఊగిపోతూ డైలాగ్ చెప్తాడు నరేష్.
'ఇంత కోపంలోనూ చాలా హ్యాపీ గా ఉన్నారేంటి' అంటాడు కార్తిక్. 'నేను ఎక్కువగా సదా గారి దగ్గర చాలా సంతోషంగా ఉంటాను' అంటాడు నరేష్. 'ఎందుకంటే ఆమె ఫోన్ మాట్లాడినప్పుడల్లా పండగే నాకు. ఎన్ని సార్లు ఆమె బుగ్గ మీద లిప్ లాక్స్ ఇచ్చానో' అంటూ సిగ్గుపడతాడు. ఇక రష్మీ విషయం ఏమిటని కార్తీక్ అడిగేసరికి 'రష్మీతో సెల్ఫీ దిగినప్పుడల్లా సెల్ ఫోన్ డెడ్ ఐపోతుంది' అంటూ నాటీ ఆన్సర్ ఇస్తాడు.