English | Telugu
అమ్మ బాలయ్యా.. నాగ్ సీట్ కే ఎర్త్ పెట్టావే!
Updated : Dec 23, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 ఇటీవలే పూర్తయింది. గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. అయితే ఈ సీజన్ మాత్రం గత సీజన్ ల తరహాలో యావరేజ్ అని కూడా అనిపించుకోలేదు. హడావిడిగా మొదలైన ఈ షో నిజంగా చెప్పాలంటే అదే స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంది. అదే గ్రాండ్ ఫినాలేని నిర్వహించిన తీరులోనూ కనిపించింది. ప్రతీ సీజన్ కి ఛీఫ్ గెస్ట్ అంటూ మెగాస్టార్ వచ్చేవారుకానీ ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ అంటూ ఎవరూ లేరు.. పైగా తూ తూ మంత్రం అనే స్థాయిలోనే ముగించారనిపించింది.
ఈ సీజన్ పరంగా హోస్ట్ గా షోని నిర్వహించడంలో కంటెస్టెంట్ లని గాడిలో పెట్టడంలో నాగార్జున విఫలమయ్యారని విమర్శలు వినిపించాయి. ఏదో వీకెండ్ లో రెండు రోజులు కనిపించామా... పని ముగించామా? అన్నట్టుగా నాగార్జున వ్యవహరించిన తీరు.. సిరి - షన్నుల హగ్గుల సీరియల్ కి ఎండ్ కార్డ్ వేయకుండా కంటిన్యూ చేయిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించిన తీరు వీక్షకులకు చిరాకు తెప్పించింది. అంతే కాకుండా సన్నీని టార్గెట్ చేయడం.. అతన్ని ఇబ్బంది పెడుతున్నా సిరి - షన్నులని నాగ్ వెనకేసుకు వచ్చిన తీరు కూడా పలు విమర్శలకు దారి తీసింది.
దీంతో హోస్ట్ గా నాగ్ దారుణంగా విఫలమయ్యారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక గ్రాండ్ ఫినాలే వేదికపై సీజన్ 6 మరో రెండు నెలల్లోనే ప్రారంభం కాబోతోందంటూ నాగార్జున ప్రకటించేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో హోస్ట్ గా నాగ్ ఫెయిలయ్యారని.. ఆ స్థానంలో మరో స్టార్ తెరపైకి రాబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. నిర్వాహకులు కూడా కొత్త హోస్ట్ ని సీజన్ 6కి మార్చేయాలనే ఆలోచనకు వచ్చిందట.
Also Read:వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్.. శేఖర్ కమ్ముల సినిమా వెనక్కి!
ఈ ఊహాగానాల మధ్య నందమూరి బాలకృష్ణ సీజన్ 6కి హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు మొదలయ్యాయి. కారణం `ఆహా` ఓటీటీ కోసం బాలయ్య `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షో పేరుకు తగ్గట్టే దూసుకుపోతోంది. తొలి సారి హోస్ట్ గా రంగంలోకి దిగిన బాలయ్య తన దైన స్టైల్లో చెడుగుడు ఆడేస్తున్నారు. బాలయ్య సీజన్ 6కి కరెక్ట్ అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట.
అందుకే ఆయనని హోస్ట్ గా ఫైనల్ చేయాలని భావిస్తున్నారంటూ వార్తలు విపిస్తున్నాయి. అంతే కాకుండా సీజన్ 6ని ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసి ఆ తరువాతే స్టార్ మా లో ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.