English | Telugu
Bigg Boss 7 Telugu : చుక్క బ్యాచ్.. మొక్క బ్యాచ్.. మధ్యలో తొక్క బ్యాచ్!
Updated : Nov 26, 2023
బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలేకి మరికొన్ని వారాలే ఉన్నాయి. ఇక పన్నెండవ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అశ్వినిశ్రీ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే.
సండే ఫన్ డే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ అభిమనులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక సండే ప్రోమో రానే వచ్చింది. ఎలిమినేష్ తర్వాత అశ్వినిశ్రీ స్టేజ్ మీదకి వచ్చింది. అసలు ఊహించలేదంటూ అశ్వినిశ్రీ తన నిరాశని వ్యక్తం చేసింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు మంచి ఫ్రెండ్ దొరికాడంటూ యావర్ ని చూపించింది అశ్విని. హౌస్ లో ఎవరెలా ఉంటారని నాగార్జున అడుగగా.. ప్రియాంక, శోభా, అమర్ ఒక బ్యాచ్.. శివాజీ అన్న, యావర్, ప్రశాంత్ ఒక బ్యాచ్.. నేనే ఏకాకిలాగా మిగిలిపోయానని అశ్విని అంది. ఇక మిగిలివున్న వారిలో గౌతమ్, అర్జున్ ఉన్నారు. నేను ఆ ఏకాకి బ్యాచ్ లో కూడా లేనా అశ్విని అని అర్జున్ అనేసరికి.. "అయ్యో అర్జున్ ఎందులో లేడా.. నువ్వేదైనా చేస్తావేమోనని భయం " అని నాగార్జున అనేసరికి అందరు నవ్వేసారు.
ప్రశాంత్ కొన్ని కొన్నిసార్లు మాట వినడు సర్ అని అశ్వినిశ్రీ అనగానే.. నీకు మిమిక్రీ చేయడం వచ్చా అని నాగార్జున అన్నాడు. లేదని అశ్విని చెప్పుగా.. "నువ్వు శివాజీ లాగా మిమిక్రీ చేసి చెప్పేస్తే వినేస్తాడు" అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత ప్రియాంక గురించి చెప్తూ.. మంచిదే సర్ కానీ కొంచెం తొందరపాటు అని అంది. హిట్టా ఫ్లాపా అని అడుగగా.. నా పరంగా అయితే ప్లాపే అని అశ్విని అంది. ఇక హౌస్ రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యిందని అశ్విని అంది. హౌస్ లో ఇప్పుడు చుక్క బ్యాచ్.. మొక్క బ్యాచ్.. తొక్క బ్యాచ్ ఉన్నారని నాగార్జున అనగానే.. హౌస్ లో నవ్వులు పూసాయి. మరి హౌస్ లో ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ ఎవరో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.