English | Telugu
Ashwini Sree Remuneration : అశ్వినిశ్రీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Updated : Nov 26, 2023
బిగ్ బాస్ సీజన్-7 పన్నెండు వారాలు పూర్తిచేసుకొని గ్రాంఢ్ ఫినాలేకి చేరువలో ఉంది. అయితే పన్నెండవ వారం డబుల్ ఎలిమినేషన్ లో శనివారం అశ్వినిశ్రీ, ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో చుక్క బ్యాచ్, మొక్క బ్యాచ్, తొక్క బ్యాచ్ ఉన్నారు.
శనివారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయింది అశ్వినిశ్రీ. స్టేజ్ మీదకి వచ్చిన అశ్వినిశ్రీ తన జర్నీ వీడియో చూసుకొని కాస్త ఎమోషనల్ అయింది. ఇక హౌస్ లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అని నాగార్జున అడుగగా ప్రియాంక, గౌతమ్, ఫ్లాప్ అని మిగిలిన వాళ్ళంతా హిట్ అని అశ్వినిశ్రీ అంది. అంబటి అర్జున్ అసలేం మాట్లాడడని కానీ గేమ్ లో బాగా ఆలోచిస్తుంటాడని అంది. పల్లవి ప్రశాంత్ మంచోడని, ఆటలో బాగా యాక్టివ్ గా ఉంటాడని, గెలవడానికి తమ వందశాతం ఇస్తాడని చెప్పింది. శివన్న ముగ్గురి మీదే కాకుండా అందరితో మాట్లాడు అన్న.. నన్ను కాస్త దూరం పెట్టినట్టు అనిపించిందని అశ్వినిశ్రీ అంది. శోభాశెట్టి పటాక అని అంది. బయటకు గంభీరంగా కనిపించిన చాలా సెన్సిటివ్ అని అశ్వినిశ్రీ అంది. ఇక యావర్ మంచి స్నేహితుడని చెప్పింది.
గ్రాంఢ్ లాంచ్ 2.0 లో ఎంట్రీ ఇచ్చిన అశ్వినిశ్రీ, భోలే షావలి ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇక కొన్నివారాల క్రితం హౌస్ నుండి భోలే షావలి ఎలిమినేట్ అవ్వడంతో.. " నేను వచ్చేస్తా, నువ్వు లేకపోతే ఎలా ఉండాలి " అంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. అయితే అశ్వినిశ్రీ హౌస్ లో యాక్టివ్ గా ఉండేది. గేమ్ లో బాగా పర్ఫామెన్స్ చేసిన ఒక్క గేమ్ లో కూడా గెలవలేకపోయింది. దీంతో పన్నెండవ వారం ఎలిమినేట్ అయింది. అశ్వినిశ్రీ రోజుకి 21 వేల చొప్పున వారానికి 1 లక్ష యాభై వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. మొత్తంగా ఏడు వారాలు ఉన్న అశ్వినిశ్రీ 10 లక్షల వరకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అశ్వినిశ్రీ ఎలిమినేషన్ తర్వాత రతిక ఎలిమినేషన్ కావడంతో హౌస్ మేట్స్ షాక్ లో ఉన్నారు.