English | Telugu
సందీప్ తేనెపూసిన కత్తి.. రతిక బ్యాక్ బిచ్చింగ్!
Updated : Sep 25, 2023
బిగ్ బాస్ సీజన్-7 ప్రతీ వారం సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. సండే ఫన్ డే అంటు నాగార్జున వచ్చేశాడు. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిస్తూ, వారిచేత ఫన్ ని క్రియేట్ చేస్తుంటాడు నాగార్జున.
బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికీ మూడు వారాలు పూర్తయింది. మొదటి రెండు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల హౌజ్ నుండి బయటకు రాగా మూడవ వారం సింగర్ దామణి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. అయితే అంతకముందు వరకు నాగార్జున వచ్చి ' చిట్టీల ఆట' అంటూ ఒక్కో కంటెస్టెంట్ కి కలర్స్ వీల్ ఇచ్చి వాటిని తిప్పమని చెప్పాడు. అందులో వచ్చిన కలర్ బట్టి ఆ కలర్ చిట్టీలో ఉన్న క్వాలిటీ హౌజ్ లో ఎవరికి ఉందో నాగార్జున చెప్పమన్నాడు. అలా ఒక్కో కంటెస్టెంట్ తో హౌజ్ లో ఎవరెంటో చెప్పించాడు నాగార్జున. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ని రెండు గ్రూప్ లుగా డివైడ్ చేశాడు నాగార్జున. వారికి ఒక మ్యూజిక్ వినిపించి అదే సినిమాలోనిదని గెస్ చేసి చెప్పాలని చెప్పాడు. ఆ తర్వాత వారితో డ్యాన్స్ చేపించాడు. ఇక సండే గెస్ట్ గా చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని వచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న 'స్కంద' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ పోతినేని బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాడు. ఇక హౌజ్ లో అందరితో కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోయాడు రామ్ పోతినేని.
చిట్డీల గేమ్ లో.. అవతలి వాళ్ళని హర్ట్ చేసి సంతోషపడేదెవరని శుభశ్రీని నాగార్జున అడుగగా.. దామిణి అని సమాధనమిచ్చింది శుభశ్రీ. కారణమేంటని నాగార్జున అనగా.. మొన్న టాస్క్ లో యావర్ ని టార్చర్ చేస్తూ తను ఒక రకమైన ఆనందాన్ని పొందింది. అది చూసి నాకు అలా అనిపించిందని శుభశ్రీ అంది. ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్ ని నాగార్జున పిలిచి.. ఈ హౌజ్ లో బ్యాక్ బిచ్చింగ్ అని ఎవరిని చూస్తే అనిపిస్తుందని నాగార్జున అనగా.. రతికని చూస్తే అనిపిస్తుందని యావర్ అన్నాడు. ఏ ఎందుకని నాగార్జున అడుగగా.. ఆ రోజు గేమ్ లో నేను ఓడిపోతే.. తన ఓట్ నాకే అని చెప్పి, కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి.. నన్ను అనర్హుడని అని చెప్పింది అందుకే తను అందరి ముందు నటిస్తుందని, అందుకే రతిక బ్యాక్ బిచ్చింగ్ అని నాకు అనిపిస్తుందని ప్రిన్స్ యావర్ అన్నాడు. తేనెపూసిన కత్తి ఎవరని దామిణిని నాగార్జున అనగా.. ఆట సందీప్ అని దామిణి అంది. ఎందుకని అనగా అతను చూడటానికి అలా ఉంటాడు. కానీ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలతో ఒకలా ఉంటాడు, మా అందరితో ఒకలా ఉంటాడని దామిణి అంది. అలా ఒక్కో కంటెస్టెంట్ వచ్చి మిగతా వారి గురించి తమ అభిప్రాయాలని పంచుకున్నారు. అలా సండే ఫండే గేమ్స్ తో సరదాగా సాగింది బిగ్ బాస్.
