English | Telugu

సీరియల్ బ్యాచ్ బంఢారం బయటపెట్టిన దామిణి!


సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలు చేస్తున్న గ్రూప్ పాలిటిక్స్ ఆదివారం ఎపిసోడ్‌తో హౌజ్ లోని అందరికి అర్థం అయింది. గత వారం నుండి జరుగుతున్న టాస్క్ లో వీళ్ళు ముగ్గురు చేసిందేమీ లేదని అందరికి తెలుసు. అదే విషయాన్ని దామణి ఈ రోజు బయటపెట్టింది‌. వీళ్ళ ముగ్గురు కలిసి మిగిలిన కంటెస్టెంట్స్ తో ఎలా ఉంటారో దామిణి సూటిగా, అందరికి అర్థం అయ్యేలా చెప్పేసింది.

మూడవ వారం జరిగిన ఎలిమినేషన్ లో దామణి హౌజ్ నుండి బయటకొచ్చేసింది‌. అయితే ఒక్కో కంటెస్టెంట్ కి నాగార్జున అడ్వైజ్ ఇవ్వమని చెప్పగా సీరియల్ బ్యాచ్ అంతా ఒకటే అన్న ధోరణిలో దామణి అంది. అమర్ దీప్ గురించి దామిణి చెప్తూ.. నీకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రియాంకకి ఇచ్చావ్.‌ కానీ తను నిన్ను అన్ డిజర్వింగ్ అని సీక్రెట్ రూమ్ లో అంది. అయినా తనకేమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావని దామిణి అంది. ఇక నాగార్జున అయితే.. ప్రియాంక అదే కారణం చెప్పి నిన్ను అన్ డిజర్వింగ్ చేస్తే ఆక్సెప్ట్ చేశావ్, అదే రీజన్ పల్లవి ప్రశాంత్ చెప్తే అతనితో ఎందుకు అలా దురుసుగా మాట్లాడావ్? అని నాగార్జున అనగా.. అదేం లేదని అమర్ దీప్ అన్నాడు. అసలు నీ కోసం ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా అని అమర్ దీప్ ని అడిగాడు నాగార్జున. అదేం లేదని ఇకనుండి నా గేమ్ ఆడతానని అమర్ దీప్ అన్నాడు.

ప్రియాంక జైన్ సేఫ్ గేమ్ ఆడుతుందని నాగార్జున అన్నాడు. ఆ రోజు సీక్రెట్ రూమ్ లో అమర్ దీప్ అన్ డిజర్వింగ్ అని చెప్పి, బయటకొచ్చాక బిగ్ స్క్రీన్ మీద అందరూ చెప్పిన రీజన్స్ చూసిస్తుంటే.. బిగ్ బాస్
నా ఒపీనియన్ మార్చుకోవచ్చా అని ఎందుకు రిక్వెస్ట్ చేశావని అడుగగా.. తడబడింది ప్రియాంక. ఇక ప్రియాంక, అమర్ దీప్ లతోనే ఎక్కువ టైమ్ గడుపుతున్నావ్‌, హౌజ్ లో వాళ్ళిద్దరే లేరు‌ మిగతా వాళ్ళతో కూడా గడపమని శోభా శెట్టితో దామిణి అంది. అయితే గేమ్ ఛేంజర్ ట్యాగ్ ని ప్రియాంక జైన్ కి శోభా శెట్టి ఇవ్వడంతో.. తను నిన్ను అన్ డిజర్వింగ్ అని చెప్పినా ఎలా ఇచ్చావంటూ నాగార్జున అడుగగా.. బిత్తెరపోయింది శోభా శెట్టి. అ తర్వాత ఏదో రీజన్ చెప్పి మాట దాటేసింది. ఇక వీళ్ళ ముగ్గురు హౌజ్ లో తమ పర్ఫామెన్స్ తో ఇరగదీస్తున్నట్టు భావించి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడేసరికి.. అసలు మీరేమైనా ఆడారా అంటు నాగార్జున ఇండైరెక్ట్ గా చాలా అన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని యావర్ ని మీరిద్దరు ఎలా డిసైడ్ చేసి పంపించేస్తారంటూ నాగార్జున ఫైర్ అయ్యాడు. ఇక అమర్ దీప్ సండే ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియలో జస్ట్ మిస్ అయ్యాడు. ఇంకో అయిదు శాతం ఓటింగ్ పడకుంటే తను ఈ వారం ఎలిమినేట్ అయ్యేవాడు. మరి ఈ నాల్లవ వారం అయినా ఈ సీరియల్ బ్యాచ్ అందరితో గడుపుతారో? లేక ఎప్పటిలాగే వీళ్ళు ముగ్గురు ఒక్క దగ్గరే ఉంటూ ఫేవరెటిజం చూపిస్తారో చూడాలి మరి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.