English | Telugu

Bigg Boss Telugu 7 Promo: శోభాశెట్టి, అమర్ దీప్ లపై నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ సీజన్-7 పదమూడవ వారం ముగింపుకి వచ్చేసింది. అయితే గతవారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండటంతో టాప్-7 లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీకెండ్ లో నాగార్జున ఎవరిపై ఫైర్ అవుతాడు, ఎవరిని మెచ్చుకుంటాడో అని తెలసుకోవాలని అందరు భావిస్తున్నారు. దీంతో ఈ రోజు ప్రోమోపై భారీ అంచనాలు పెరిగాయి.

నిన్నటి టికెట్ టు ఫినాలే టాస్క్ లో అంబటి అర్జున్, అమర్ దీప్ లలో అర్జున్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే శోభాశెట్టి, అమర్ దీప్ కలిసి టికెట్ టు ఫినాలే లో జరిగిన టాస్క్ లలో కొన్ని మిస్టేక్స్ చేశారు. కాబట్టి దీని గురించి హోస్ట్ నాగార్జున శోభాశెట్టి, అమర్ దీప్ లకి క్లాస్ పీకుతాడా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ గా మారింది. ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న ఈ రోజు ప్రోమో రానే వచ్చింది. టికెట్ టు ఫినాలేకి వెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్ అర్జున్ అని చెప్పాడు నాగార్జున. ఇక ఫినాలే టాస్క్ లో శోభాశెట్టి, శివాజీల పర్ఫామెన్స్ ఇలా ఉందంటూ 90 మార్కులు ఇవ్వగా.‌. నేను 200 శాతం ఇచ్చానని శోభాశెట్టి అంది.

ఇక అమర్ దీప్ కి పాయింట్లు ఇవ్వడం గురించి శోభాశెట్టి, శివాజీలని నాగార్జున అడిగాడు. అవును సర్ నేను ముందే మాటిచ్చానని శివాజీ అనగా.. అంతేనా లేక అలుగుతాడనా అని నాగార్జున అడిగాడు. లేదు సర్ అలగడని శోభాశెట్టి అంది. ఇక ప్రియాంకతో కంటిన్యూ గా అదే లూప్ కదా అని నాగార్జున అనగా హౌస్ మేట్స్ అంతా కాసేపు నవ్వుకున్నారు. బాల్ వేసే టాస్క్ లో ఎందుకు ఓడిపోయావని ప్రియాంకని అడుగగా.. సంఛాలక్ పెట్టిన రూల్ వల్ల అని అంది. దానివల్లే నీ పాయింట్లు గౌతమ్ కి ఇచ్చావా అని అడుగగా.. నా మైండ్ లో ఇద్దరు ఉన్నారు. అమర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడని ప్రియాంక అంది. ఇక నువ్వెందుకు పాయింట్లు ఇచ్చావో శోభాకి అసలు అర్థమే కాలేదని అని నాగార్జున చెప్పగా.. అర్థమైనవాళ్ళకి అర్థమైతే చాలని ప్రియాంక అంది. ఇలా వీక్ లో జరిగిన టాస్క్ ల గురించి ఒక్కొక్కరిని నాగార్జున అడుగుతూ శనివారం నాటి మొదటి ప్రోమో ఆసక్తిరంగా ఉంది.