English | Telugu
నీ ఆట లేదంటూ గౌతమ్‌ని ఉతికారేసిన నాగార్జున!
Updated : Dec 3, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ఫస్ట్ వీక్ నామినేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకొని గత పన్నెండు వారాల నుండి శివాజీని నామినేట్ చేసిన గౌతమ్ కృష్ణని నిలదీసాడు నాగార్జున. ఎందుకని ఇలా చేస్తున్నావని అడగ్గా.. శివాజీగారు ప్రశాంత్, యావర్ ఇద్దరిలో ఎవరేం తప్పు చేసినా వాళ్ళని నామినేట్ చేయడు. కానీ ఇంక ఎవరినైనా నామినేట్ చేస్తాడని గౌతమ్ అన్నాడు.
ప్రస్తుతం హౌస్‌లో ఇద్దరు తప్పులు చేస్తున్నారు. కానీ శివాజీ వారిని నామినేట్ చేయట్లేదంటావా గౌతమ్ అని నాగార్జున అనగా.. అలా అని కాదు సర్.. వారిద్దరి మీద శివాజీ గారికి గ్రాట్యిట్యూడ్ ఉంది. ఇంకెవరి మీదా లేదని గౌతమ్ అన్నాడు. సరే అది పక్కన పెట్టు. ఇప్పటివరకు హౌస్‌లో ఒక్కసారి అంటే ఒక్కసారి అయిన శోభాశెట్టి, అమర్ దీప్‌లని ప్రియాంక నామినేట్ చేసిందా అని నాగార్జున అడిగాడు. లేదని గౌతమ్ అనగా.. లేదన్నప్పుడు ఎందుకు ఇలా ముగ్గురు కలిసి ఆడుతున్నారని నువ్వు అడగాలి కదా అని నాగార్జున అన్నాడు. మొన్న చెప్పాను సర్.. అమర్ వల్ల నీ గేమ్ పోతుందని ప్రియాంకతో చెప్పాను సర్ అని గౌతమ్ అన్నాడు. నువ్వు ప్రియాంక చెప్పినట్లు విన్నావ్. నీ అభిప్రాయం ఏది అని అడిగేసరికి... గౌతమ్ తడబడ్డాడు. పన్నెండు వారాలు అయిపోయింది ఇంకా ఒకరికోసం ఒకరు ఆడటమేంటి. ఇండివిడ్యువల్ గేమ్ ఆడండి అంటూ ప్రియాంక, గౌతమ్ లకి నాగార్జున చెప్పాడు.
దాంతో నీకంటూ ఒక గేమ్ ప్లాన్ లేదు. నీ ఆట లేదు. నీ గేమ్ చూశాకా నాకు ఒకటి అయితే క్లియర్‌గా అర్థమైపోయింది.. నీకు అర్జున్ కంటే ప్రియాంక చెల్లే ముఖ్యం అంటూ నాగార్జున వేశాడు. దీనికి ఏదో పొగిడినట్లుగా ప్రియాంక తెగ నవ్వేసుకుంది. దీంతో తనని పైకి లేపి నాగార్జున క్లాస్ పీకారు. ప్రియాంక.. ఇక నుంచి ఇండివిడ్యూవల్ గేమ్ మాత్రమే నో మోర్ గ్రూప్ గేమ్ అని అన్నాడు.