English | Telugu

Bigg Boss 9 Telugu: తనూజకి దిమ్మతిరిగే వీడియో చూపించిన నాగార్జున.. గేమ్ ఆన్!

బిగ్ బాస్ సీజన్-9 ఐదో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో... నాగార్జున మాస్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. సేఫ్ జోన్ లో ఉన్నవాళ్ళకి గోల్డెన్ స్టార్ ఇచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనూజ నీతో పర్సనల్ గా మాట్లాడాలని యాక్టివిటీ రూమ్ కి పిలుస్తాడు. నేనొక వీడియో చూపిస్తాను‌. అది ఎవరికి చెప్పొద్దంటాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు లైట్ వేసారో గెస్ చేసే టాస్క్ లో కళ్యాణ్ కి డీమాన్ కాలు ద్వారా భరణి అని హింట్ ఇచ్చినట్లు వీడియోలో ఉంటుంది.

ఇప్పటికి అయినా అర్థం అవుతుందా.. నీ వెనకాల ఏం జరుగుతుందో.. చాలా గ్యాప్ తీసుకొని కళ్యాణ్.. భరణి పేరు చెప్పాడు. ఆ తర్వాత ఆ విషయం నీతో షేర్ చేసుకున్నాడా అని నాగార్జున అడుగుతాడు.. లేదని తనూజ అంటుంది. నువ్వు ఆటకి వచ్చేసరికి నువ్వు సింగల్ గా ఆడు, ఎమోషనల్ అవ్వకు అని తనూజకి నాగార్జున మోటివేట్ చేస్తాడు.

ఈ వారం మొత్తం తనూజ, కళ్యాణ్ ఒక టీమ్.. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని సేఫ్ జోన్ లోకి వెళ్లారు. కళ్యాణ్ తో బాండింగ్ పెంచుకుంటే తనూజ ఆట మిస్ చేసుకుంటుందని తనని నాగార్జున అలెర్ట్ చేసినట్లున్నాడు. అలాగే ఇలా బాండింగ్ పెంచుకొని గేమ్ మీద ఫోకస్ చెయ్యడం లేదని అందరికీ క్లియర్ గా అర్థం అవుతుంది. అవి తొలగించి గేమ్ పై ఆసక్తి పెట్టేలా అందరికి చిన్న వార్నింగ్ అయితే ఇచ్చాడు నాగార్జున. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.