English | Telugu

సుమ వ‌ల్ల ర‌వికృష్ణ‌కు బ్రేక‌ప్ చెప్పిన న‌వ్యా స్వామి

బుల్లితెర సీరియ‌ల్ క‌పుల్ ర‌వికృష్ణ‌, న‌వ్యా స్వామి క‌రోనా వేవ్ ఉదృతంగా వున్న స‌మ‌యంలో వీరి పేరు వార్త‌ల్లో నిలిచింది. ముందు న‌వ్యా స్వామికి క‌రోనా సోకింది. ఆ త‌రువాత ర‌వికృష్ణ కూడా కోవిడ్ బారిన ప‌డ్డాడు. దీంతో ఇద్ద‌రు వార్త‌ల్లో నిలిచారు. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ వైర‌ల్ అయ్యారు కూడా. కార‌ణం ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌ని, గ‌త కొంత కాలంగా `ఆమె క‌థ‌` సీరియ‌ల్ లో న‌టించిన వీరు అదే సీరియ‌ల్ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ్డారంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

వీరిద్ద‌రి మ‌ధ్య వున్న ప్రేమ‌ని యాంక‌ర్ సుమ మ‌రోసారి గుర్తు చేస్తూ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌కు తెర‌లేపింది. వివ‌రాల్లోకి వెళితే.. సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `క్యాష్` షో కోసం న‌వ్యా స్వామి - ర‌వికృష్ణ రీల్ క‌పుల్ గా రియ‌ల్ క‌పుల్ గా సిద్ధార్ధ్ - విష్ణుప్రియ‌ల‌ను ఆహ్వానించింది. ఈ షోలో ఈ రెండు జంట‌ల చేత రొమాంటిక్ టాస్కులు చేయించింది. ఈ నెల 29న శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. ఈ సంద‌ర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో న‌వ్యా స్వామి - ర‌వికృష్ణ‌కు బ్రేక‌ప్ చెప్పే సీన్ హైలైట్ గా మారింది. త‌న ల‌వ్ విష‌య‌మై ర‌వికృష్ణ ను ఎంతో హార్ట్ చేస్తూ ఓపెన్ అయింది న‌వ్యా స్వామి.

సిద్ధార్ధ్ - విష్ణు ప్రియ‌ల‌తో ముద్దుల టాస్క్ చేయించిన సుమ‌.. న‌వ్యా స్వామి - ర‌వికృష్ణ ల రొమాంటిక్ స్టెప్పులు చూసి మీరు రియ‌ల్ లైఫ్ క‌పుల్ కాదు.. రీల్ లైఫ్ క‌పుల్ అంటూ పంచ్ వేసింది. నీకు గ‌డ్డం వుండే బాయ్స్ ఇష్ట‌మా? అని సుమ అడిగిన ప్ర‌శ్న‌కు గ‌డ్డం ఉంటేనే బాగుంటారు అంటూ ర‌వికృష్ణ‌ను చూస్తూ న‌వ్యా స్వామి స‌మాధానం చెప్ప‌గానే వెంట‌నే స‌మ మ‌రో పంచ్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.