English | Telugu
ఇది చూసి కనిపెడితే నా పెళ్ళాం మాములుగా కొట్టదు!
Updated : Jun 25, 2023
"సుమ అడ్డా షో"లో ప్రతీ వారం వచ్చే గెస్టులతో రకరకాల గేమ్స్ ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది సుమ. మరి నెక్స్ట్ వీక్ షోకి ఎవరు రాబోతున్నారు అంటే "రంగబలి" మూవీ నుంచి నాగశౌర్య, నోయెల్, యుక్తి థేరేజా, డైరెక్టర్ పవన్ రాబోతున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. స్టేజి మీదకు డైరెక్టర్ వస్తూనే చేతిలో వాచ్ పట్టుకుని వచ్చేసరికి సుమ సెటైర్ వేసేసింది. "ఎవరైనా టైంని కట్టుకుని వస్తారు కానీ ఈయన టైంని పట్టుకుని వచ్చారు" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత ఫస్ట్ రౌండ్ ఆడించింది సుమ. అందులో ముందుగా "పెళ్లి అంటే ముందుగా ఏం గుర్తొస్తుంది" అని అడిగేసరికి "శోభనం" అని చెప్పారు పవన్. ఆ ఆన్సర్ కి "భయ్యా మీరు డైరెక్ట్ గా లాస్ట్ రౌండ్ ఆడతారా" అని సెటైర్ వేసాడు నోయెల్. "ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గెస్ చేసి చెప్పండి" అని సెకండ్ రౌండ్ లో ఒక ప్రశ్న అడిగింది సుమ. దానికి నాగశౌర్య ఫుల్ జోష్ తో "ఇది చూసి కనిపెడితే నా పెళ్ళాం మాములుగా కొట్టదు" అన్నాడు.
"మీకు హీరో నాగశౌర్య ఎప్పటి నుంచి ఎలా తెలుసు..పర్సనల్ గా ఎప్పటి నుంచి తెలుసు " అని డైరెక్టర్ పవన్ ని అడిగింది సుమ. "ఆయన ఫస్ట్ మూవీ నుంచి తెలుసు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా అలా తెలుసు. మహా ఐతే రెండేళ్ల నుంచి తెలుసు...రిలేషన్ ని గుర్తుపెట్టుకుంటాం కానీ డ్యూరేషన్ ని గుర్తు పెట్టుకోలేం కదా " అని తెలివిగా ఆన్సర్ చేసేసరికి వావ్ అంది సుమ. తర్వాత కొన్ని గాడ్జెట్స్ ని ప్లే చేసి అవేంటో చెప్పాలి అనేసరికి ప్రింటర్ ని చూసి ఏసీ అని చెప్పింది హీరోయిన్. దానికి డైరెక్టర్ పవన్ ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. "ప్రింటర్ లోంచి ఏసీ వస్తుందని నాకు తెలీదు" అన్నాడు.