English | Telugu
మెహందీ ఫంక్షన్ లో మా హడావుడి!
Updated : Jun 25, 2023
కెవ్వు కార్తీక్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కామెడీయన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట టీంలో ఒక మెంబర్ గా ఉన్న కార్తిక్.. ఆ తర్వాత టీంకి లీడర్ గా ఎదిగాడు. కెవ్వు కార్తిక్ తో ముక్కు అవినాష్ కూడా కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూయించారు.
అయితే కెవ్వు కార్తీక్- ముక్కు అవినాష్ లు అప్పట్లో వరుసగా ప్రతీ స్కిట్ హిట్ కొట్టేవారు. ఒక్కో స్కిట్ లో ఒక్కో పాయింట్ తో కొత్తగా స్కిట్లు చేస్తూ సీనియర్ టీమ్స్ కి పోటీగా వచ్చేవారు. అయితే వీళ్ళు చేసే 'కన్ఫూజన్' స్కిట్ ఎప్పుడు ప్రెష్ ఫీల్ ని ఇస్తుంది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి సినిమాలలో అవకాశాలు పొందుతూ సక్సెస్ అయినవారు చాలానే ఉన్నారు. అయితే వీరిలో వేణు వెల్దండి, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, శకలక శంకర్, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర లు ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. అయితే ఈ లిస్ట్ లోకి కెవ్వు కార్తిక్ కూడా చేరాడు. జబర్దస్త్ కి రాకముందు మిమిక్రీ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్.. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని సినిమాలలో అవకాశాలు పొందుతున్నాడు. గతేడాది రిలీజైన 'ముఖచిత్రం' సినిమాలో నటించిన కార్తిక్.. తాజాగా 'నేను స్టూడెంట్ సర్' సినిమాలో చేసాడు.
ఇప్పుడు కెవ్వు కార్తిక్ టీం లీడర్ గా మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాదులో కార్తిక్ - శ్రీలేఖల వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు టీవి ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. అయితే పెళ్ళి కోసం తను చేసిన నగల షాపింగ్, చీరల షాపింగ్ , కన్వెన్షన్ హాల్ ని చూపిస్తూ వ్లాగ్ లు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాడు కార్తిక్. అయితే కెవ్వు కార్తిక్ - శ్రీలేఖల పెళ్ళి ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. కాగా ఇప్పుడు కార్తిక్ తన యూట్యూబ్ ఛానెల్ లో మెహెందీ ఫంక్షన్ లో ఎలా ఉంటుంది. ఏం చేస్తారు? ఏమేమీ ఆచారాలు, సంప్రదాయాలుంటాయో వివరిస్తూ 'మెహందీ ఫంక్షన్ లో మా హడావుడి' అనే టైటిల్ తో అప్లోడ్ చేసాడు. కాగా ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.