English | Telugu

కోటి పుట్టినరోజుకు 28 రకాల వంకాయ కూరలు చేసి పంపిన లేడీ ఫ్యాన్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 స్వర కిరీటి కోటి ఛాలెంజ్ ఎపిసోడ్ జోష్ తో సాగింది. సంగీతం అంటే ఇష్టపడే ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో సౌజన్య ముందుగా వచ్చింది.. ఈమె కన్నా ఈమె కూతురు మిహిర ఫుల్ ఫేమస్ ఐపోయింది. ఆమెకు షడ్రుచులలో భాగంగా స్పైసీ సాంగ్ పాడమని ఛాలెంజ్ ఇచ్చారు కోటి. "ముఠామేస్త్రి" మూవీ నుంచి సాంగ్ పాడింది. కోటి ఆమె సాంగ్ కి ఫిదా ఐపోయి ఆయన కూడా స్టార్టింగ్ లైన్స్ పాడి వినిపించారు. ఇక థమన్ కూడా చక్కగా పాడావ్ అంటూ కామెంట్ చేశారు. ఈ సీజన్ లో ఎంతో మధురమైన గొంతు నీది...టాప్ 5 లో ఉంటావని అనిపిస్తోంది అంటూ కార్తీక్ చెప్పారు.

కోటి సౌజన్యకు మరో ఫ్రెష్ ఛాలెంజ్ ఇచ్చారు. తాను కంపోజ్ చేసిన సాంగ్ ఇంకా రిలీజ్ కూడా కాలేదని చెప్పి స్టేజి మీద ఆమెతో కలిసి అద్భుతమైన లిరిక్స్ ఉన్న సాంగ్ పాడించారు. నెక్స్ట్ కంటెస్టెంట్ గా యుతి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు వగరు ప్లస్ ఉప్పు కలగలిసిన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోటి ఛాలెంజ్ ఇచ్చారు. దాంతో "పెదరాయుడు" మూవీ నుంచి "బావవి నువ్వు" సాంగ్ పాడింది. ఆ పాట విన్న కోటి "యుతి నాకు ముందే తెలుసు ..అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యింది. జానపదం పాట కాబట్టి ఇంకా షార్ప్ నెస్ అనేది రావాల్సి ఉంది.." అని చెప్పారు. కార్తీక్ యుతి చేసిన మిస్టేక్స్ గురించి చెప్పాడు. అలాగే థమన్ కూడా లాస్ట్ టు లైన్స్ తప్ప మిగతా సాంగ్ పాడిన విధానం అస్సలు నచ్చలేదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత యుతి తన కోరికను బయట పెట్టింది. కార్తీక్ తో కలిసి "గజినీ" మూవీ నుంచి "ఒక మారు" సాంగ్ పాడింది. తర్వాత తన దగ్గర ఉన్న మూవీ సిడి మీద ఆటోగ్రాఫ్ అడిగేసరికి "లాస్ ఆఫ్ లవ్ యుతి" అని రాశారు.

తర్వాత జయరాంని పిలిచారు కోటి. పులుపు అంటే నాటీగా ఎలా ఉంటుందో అలాంటి సాంగ్ పాడాలి అని ఛాలెంజ్ ఇచ్చారు. "మల్లేశ్వరి" మూవీ నుంచి "నువ్వెంత అందగత్తెవని" సాంగ్ పాడి వినిపించాడు. ఇక హోస్ట్ హేమచంద్ర జడ్జెస్ ని లైఫ్ లో ఎదురైన బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ చెప్పమని అడిగాడు. దాంతో ముందు కోటి గారు మాట్లాడుతూ " నా బర్త్డే మే 28 . నాకు గుత్తివంకాయ కూర అంటే ఇష్టమని ఒక సందర్భంలో చెప్పాను. అది తెలుసుకున్న ఒక లేడీ ఫ్యాన్ నా కోసం 28 రకాల వంకాయ కూరలు చేసి నన్ను తినమని పంపించారు. నా లైఫ్ లో ఇలాంటి ఒక ఫ్యాన్ ని నేనెప్పుడూ చూడలేదు" అంటూ తన బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.