Read more!

English | Telugu

పొంగిపొర్లిన దేశభక్తి... కంటతడి పెట్టుకున్న కోటి

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 "కోటిస్ ఉగాది స్పెషల్" ఎపిసోడ్ గా ఈ వారం రాబోతోంది. ఇందులో బిఎస్ఎఫ్ జవాన్ చక్రపాణి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఎంటర్టైన్ చేసింది. "ముఠామేస్త్రి" మూవీ నుంచి సాంగ్ పాడాడు. "ఉగాది రోజు మీరు ఇంకా యూనిఫార్మ్ వేసుకునే వచ్చారు" అని తమన్ అన్నారు. తర్వాత కార్తిక్ స్టేజి మీదకు వచ్చి "జనరల్ గా మీరు ఉగాదిని ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు" అని అడిగాడు. "నా లైఫ్ లో ఉగాదిని నేనెప్పుడూ చూడనేలేదు ..ఏ ఫెస్టివల్ వచ్చినా సరే అమ్మకు ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకుంటాను..అంతేసర్" అన్నాడు ..ఆ టైములో వెనక నుంచి చక్రపాణి వాళ్ళ అమ్మ స్టేజి మీదకు "చిన్నా" అని పిలుచుకుంటూ వచ్చేసరికి ఆమెను చూసి నోటమాట రాక ఆమెను హగ్ చేసుకున్నాడు.

"నాకు అమ్మంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఊరెళ్లినా అమ్మ ఒళ్లోనే పడుకుంటాను..అమ్మ ఊళ్ళోనే కూర్చుని పాటలు పడతాను. నా మూడేళ్ళ వయసులో మా నాన్న చనిపోయారు. మా అమ్మే చాలా కష్టపడి పెంచింది అని చెప్పి ఆమె కోసం కొన్న గాజులను బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను జడ్జి సీట్ లో కూర్చోబెట్టి చక్రపాణి ఆమె ముందే సాంగ్ పాడాడు...ఈ స్టేజి మీద జరిగిన ఈ మొత్తంతో కోటి, మిగతా కంటెస్టెంట్స్ అంతా కన్నీటిపర్యంతమయ్యారు. నెటిజన్స్ చక్రపాణి పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఐపోయి కామెంట్స్ పెట్టారు. "అమ్మని ఎదురుగా కూర్చోపెట్టుకుని పాట పాడడం కన్నా ఇంకా ఏమి ఉంటుంది గెలుపుకు అర్థం.. టైటిల్ ఎవరు గెలిచినా ఇంతకుమించిన విజయం..లేదు.. జై జవాన్.. జై హింద్...వీరజవాన్లకు, సైనికులందరికీ వందనాలు...మీ కలల ప్రయాణం విజయతీరాలవైపు కొనసాగాలని కోరుకుంటూ" అంటూ అందరూ ఆ జవాన్ కి విషెస్ చెప్పారు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.