English | Telugu
కృష్ణని డ్రెస్ లో చూసి షాకైన భవాని.. డల్ గా మురారి!
Updated : Aug 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -235 లో.. కృష్ణ నిద్ర లేచి మురారి దగ్గరకి వెళ్లి మురారిని చూస్తూ.. మీరు నా మనసులో ఉన్నారు. మీ తల రాతలో నేను ఉన్నానని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే మురారి నిద్ర నుండి లేస్తాడు. అప్పటికే కృష్ణ క్యాంపుకి వెళ్ళడానికి అన్ని సర్దుకుంటుంది. ఏసీపీ సర్ మీరు ఇక నుండి ఈ షాంపులు వాడండి అంటూ మురారికి ఇస్తుంది కృష్ణ. మురారి మాత్రం సైలెంట్ గా ఉంటాడు.
మరొక వైపు కృష్ణ క్యాంపుకి వెళ్లే కంటే ముందే మురారి కృష్ణని ప్రేమించే విషయం తనకి చెప్పాలని గౌతమ్ తో నందు చెప్తుంది. మరొకవైపు కృష్ణ, మురారిల గురించి రేవతి ఆలోచిస్తుంటుంది. అప్పుడే రేవతికి భవాని కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి అక్క.. కాఫీ నువ్వు తెచ్చావని రేవతి అడుగుతుంది. ఎప్పుడు నువ్వే తేవాలా? నేను తేకూడదా అని భవాని అంటుంది. ఆ తర్వాత రేవతి డల్ గా ఉంటుంది. ఏమైంది రేవతి ఎప్పుడు డల్ గా ఉంటున్నావ్ అని భవాని అడుగుతుంది. కృష్ణ క్యాంపుకి వెళ్తుంది కదా.. అక్కడ ఎలా ఉంటుందో? ఏంటో అని రేవతి అంటుంది. కృష్ణ అమ్మ నాన్నల కలని మనము నేరవేరుద్దామని భవాని అంటుంది. నేను కృష్ణ కోసం హాస్పిటల్ కట్టిద్దామని అనుకుంటున్నాను.. పేదలకి కృష్ణ ఫ్రీగా ట్రీట్ మెంట్ ఇస్తుందని భవాని అనగానే రేవతి చాలా సంబరపడుతుంది. ఆ తర్వాత వాళ్ళు నిజమైన భార్యభర్తలు కాదని తెలిస్తే ఎంత బాధపడుతుందోనని రేవతి అనుకుంటుంది.
మరొకవైపు కృష్ణ చీర కాకుండా డ్రెస్ వేసుకొని మురారి దగ్గరికి వస్తుంది. కృష్ణని అలా డ్రెస్ లో చూసి మురారి షాక్ అవుతాడు. ఇప్పటి నుండే తను మారిపోవడం మొదలు పెట్టిందన్నమాట అని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత మురారి కాళ్ళని కృష్ణ కడుగుతుంది. అప్పుడే కృష్ణ మురారి, ముకుందలని కిందకి రమ్మని భవాని పిలుస్తుంది. ఎప్పుడు చీరలో ఉండే కృష్ణ డ్రెస్ లో ఉండడంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి తీంగరిపిల్ల.. ఈ అవతారం మార్చేసావని భవాని అడుగుతుంది. క్యాంపు కదా అత్తయ్య కంఫర్ట్ ఉంటుందని వేసుకున్నానని కృష్ణ చెప్తుంది. క్యాంపు నుంచి రాగానే నీకొక సర్ ప్రైజ్ ఉందని కృష్ణతో భవాని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.