English | Telugu
కావ్యకి స్వేచ్ఛనివ్వాలని చెప్పిన సీతారామయ్య!
Updated : Aug 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -174 లో.. ఇంట్లో అందరు నేను చేసేది తప్పని చెప్పినా, నేను చేసే పని మాత్రం ఆపనని కావ్య చెప్పగానే.. చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందోనని అపర్ణ అంటుంది. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినొచ్చు కదా కావ్య అని ఇందిరాదేవి అంటుంది. అంటే మీరు కూడా నేను చేసిన పని తప్పని భావిస్తున్నరా అని కావ్య అంటుంది.
ఆ తర్వాత నీకు నచ్చింది నువ్వు చేసుకుంటానంటే, నువ్వు ఇక్కడ ఉండకూడదు మాకు నచ్చినట్టు నువ్వు ఉంటేనే ఈ ఇంట్లో స్థానం అని అపర్ణ చెప్పగానే.. కావ్య షాక్ అవుతుంది. నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అపర్ణ అనగానే.. అప్పుడే సీతరామయ్య వచ్చి కోపంగా.. ఇక ఆపండి అని అంటాడు. అందరు తను చేసింది తప్పని ఎందుకంటున్నారు. కావ్య మన ఇంటి పరువు తీసేలా ఏం పని చేసింది.. చెప్పాలంటే మన కుటుంబ పరువు నిలబెట్టింది. ఆ ఇంటి కోడలు ఏం చేసినా చేయనిచ్చే స్వేచ్ఛ ఇచ్చారని, మన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీడియా ముందు ఏం అని చెప్పింది. నా కుటుంబం నాకు సపోర్ట్ గా ఉందని చెప్పింది. మీరు అలా సపోర్ట్ ఇస్తున్నారా అంటూ సీతరామయ్య.. ఇంట్లో అందరిపై కోప్పడుతాడు. ఈ ఇంట్లో కావ్య ఏం చేసిన అడ్డు చెప్పకూడదు.. ఇంటి పెద్దగా ఇది నా నిర్ణయమని సీతరామయ్య అందరికి చెప్తాడు. మరొక వైపు కృష్ణమూర్తి ఆలోచిస్తుంటాడు. అప్పుడే కనకం వస్తుంది. మనం కష్టంలో ఉన్నామంటే మనం ఎంత ఆపినా కావ్య రాకమానదు. ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బులతో సేటు అప్పు తీర్చి మిగిలిన డబ్బుతో అప్పు పెళ్లి చేద్దామని కృష్ణమూర్తి అంటాడు. దానికి కనకం కూడా సరే అంటుంది.
మరొక వైపు కావ్య, రాజ్ లకి చిన్నపాటి మాటల యుద్ధమే జరుగుతుంది. నువ్వు అసలు మీ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదని రాజ్ అంటాడు. సరే వెళ్ళనని కావ్య అంటుంది. ఏంటి ఇంత సింపుల్ గా ఒప్పుకుంది. దీని వెనకాల ఏదైనా కారణం ఉందా అని రాజ్ నిద్రపోకుండా ఆలోచిస్తుంటాడు. అదే విషయం కావ్యని నిద్ర లేపి అడుగుతాడు. ఏంటి ఇంత సింపుల్ గా ఒప్పుకున్నావని రాజ్ అనగానే.. కావ్య ఏం చెప్పదు. మరుసటి రోజు ఉదయం కావ్య లేచి పని చేస్తుంటుంది. ఎలాగైనా సీతరామయ్య దృష్టిలో పడి.. ఎందుకు ఇంక మీ ఇంటికి వెళ్ళలేదని సీతరామయ్య అడగాలని కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.