English | Telugu
సదాని ఏడిపించిన పవన్, అంజలి!
Updated : Aug 15, 2023
"నీతోనే డాన్స్ రేస్ టు ఫినాలే" సెకండ్ పార్ట్ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ ఐపోయింది. నీతోనే డాన్స్ ఫైనల్స్ కి దగ్గర పడిపోయిందన్న విషయం దీన్ని బట్టి అర్ధమైపోతుంది. ఈ ప్రోమో చూస్తే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పిచ్చి పిచ్చిగా దుమ్ము రేపే డాన్స్ లు చేసి ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక జోడీస్ అన్ని కూడా ఈ ఫినాలే రేస్ లో స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతిబింబించే డాన్సులు చేసి అలరించారు.
ఇక ఆట సందీప్ - జ్యోతి డాన్స్ లో ఒక చోట స్లిప్ ఐన విషయాన్ని అమరదీప్ ఎత్తి చూపించేసరికి సందీప్, జ్యోతి ఇద్దరూ ఫైర్ అయ్యారు. "బ్రదర్ మాట్లాడేటప్పుడు కొంచెం బుర్ర వాడు..నేను గోల్డెన్ సీట్ లో కూర్చోవడానికి రాలేదు ఫైనల్స్ లో నేనేంటో చూపిస్తాను.. నాకు డాన్స్ అంటే ఎంత పిచ్చో నీకు చూపిస్తాను " అని అమర్ ని కామెంట్ చేసాడు ఆట సందీప్. "సందీప్ డాన్స్ తో ఆ స్టేజి మీద ఎలా సచ్చిపోతాడు నేను కూడా అదే స్టేజి మీద డాన్స్ కోసం చచ్చిపోతాను" అని రివర్స్ లో అదే స్పీడ్ తో కౌంటర్ వేసాడు అమరదీప్. అలాగే తర్వాత సాగర్- దీప జోడి కూడా ఆట సందీప్-జ్యోతి డాన్స్ లో ఒక చోట స్లిప్ అయ్యిందనే విషయాన్ని చెప్పారు. దానికి ఆట సందీప్ కి కోపం నషాళానికి అంటేసింది. వెంటనే తన భార్య జ్యోతిని అందరి ముందే తిట్టేసాడు "డాన్స్ సరిగా నేర్చుకో అర్దమయ్యిందా..సిగ్గుండాలి" అని అన్నాడు. "ఎప్పుడు మీరు చెప్తే మేము వినాలి మేము ఏమన్నా అంటే మాత్రం మీరు తీసుకోరా" అని ఎప్పుడూ మాట్లాడని సాగర్ కూడా ఫుల్ ఫైర్ ఐపోయాడు.
తర్వాత మిగతా జోడీస్ కూడా అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మ్ చేసాయి. తర్వాత అంజలి, పవన్ జోడి చేసిన హారర్ యాక్షన్ కి సదా భయపడిపోయి అంజలి మీద గట్టిగా గట్టిగా సరిచేసి ఏడ్చేసింది. ఇక ఈ డాన్సస్ లో యాక్షన్, డ్రామా, హారర్ చూడాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే.