English | Telugu

బ్యాంకాక్ లో సెల్ ఫోన్ పోయింది..అది తలుచుకుని ఎంత ఏడ్చానో

బుల్లితెర నటి శ్రీవాణి ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ తోనే తన యూట్యూబ్ లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక వీడియోని రిలీజ్ చేసింది. తన టీమ్ మొత్తం కలిసి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు చెప్పి బాధపడింది. "బ్యాంకాక్ కి వెళ్ళినప్పుడు నా హడావిడి వలన సెల్ ఫోన్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. సెల్ ఫోన్ కే అంత బాధ పడుతుండడానికి కారణం ఏంటంటే మా ఏడు రోజుల ట్రిప్ లో ఎన్నో వీడియోస్ కాప్చర్ చేసుకున్నాం.

బ్యాంకాక్ లో మంకీతో ఆడుకోవడం కావచ్చు, టైగర్ పిల్లను ఎత్తుకుని పాలు తాగించడం, మొదటిసారి నా బాడీ మీద పాములు వేయించుకున్నాను అక్కడి స్ట్రీట్ ఫుడ్, అక్కడి లైఫ్ స్టైల్ మొత్తాన్ని వీడియోస్ గా తీసాం. ఐతే షాపింగ్ కోసం ఇంద్ర స్క్వేర్ మాల్ అనే ప్లేస్ కి వెళ్లాం..నేను క్యాబ్ దిగేసి లగేజ్ తీసుకుని వెళ్ళిపోయా. ఆ తర్వాత గుర్తొచ్చింది క్యాబ్ లో సెల్ ఫోన్ మర్చిపోయాను అన్న విషయం. నా పక్క సీట్లో పెట్టేసాను కదా అని గుర్తొచ్చింది. ఆ క్యాబ్ డ్రైవర్ ఫేస్ కూడా నాకు గుర్తులేకపోయేసరికి వచ్చిన క్యాబ్స్ ని ఆపుతూ డ్రైవర్స్ ని చూస్తూనే ఉన్నా. ఐతే ఆ సెల్ లో ఎటువంటి సిమ్ కార్డు లేదు, ఏ ఐడితో కూడా లాగిన్ అయ్యి లేదు. ప్లెయిన్ న్యూ హ్యాండ్ సెట్ అన్నమాట. సింగర్ విజయలక్ష్మి అక్క వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని చెప్పింది.

ఐతే వాళ్ళు చాలా డీటెయిల్స్ అడిగారు. వాటికి నా దగ్గర సరైన సమాధానాలు లేవు. సెల్ ఫోన్ నంబర్ లేదు, క్యాబ్ ఎక్కడ ఎక్కామో, దాని నంబర్ ఎంతో, ఏ గేట్ దగ్గర ఎక్కామో ఏమీ తెలీదు అని చెప్పా. మా బాషా వాళ్లకు రాకపోయినా ట్రాన్స్లెటర్ ని పెట్టి నా డీటెయిల్స్ తీసుకుని ఆ సెల్ దొరికిన వెంటనే ఇస్తామని కంప్లైంట్ లెటర్ కాపీ కూడా ఇచ్చారు. మన పెద్దవాళ్లు అందుకే అంటారు తెలియని ప్లేస్ కి వెళ్ళేటప్పుడు ప్రతీ డీటెయిల్స్ ని దగ్గర పెట్టుకోండి అని..సెల్ ని నమ్మొద్దు కాగితం మీద రాసుకుని పెట్టుకోండి లేదంటే బుర్రలో రిజిస్టర్ చేసుకోమని చెప్తారు. సెల్స్ లోని తల దూర్చేసి పనులు చేసుకుంటూ ఉంటే చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఐతే ఆ సెల్ గురించి తలచుకుని నా మెమోరీస్ అన్ని అందులోనే ఉండిపోయాయి అని బాధేసి ఏడుపొచ్చేసింది. బయటికి వెళ్ళాక చుట్టూ కొంచెం కనిపెట్టుకుని ఉంటే బాగుంటుంది." అంటూ సలహా ఇచ్చింది శ్రీవాణి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.