English | Telugu

నేను ఇండో పాక్‌ మిక్స్డ్ బ్రీడ్

'పోకిరి' త‌రువాత టాలీవుడ్‌లో ఐట‌మ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది ముమైత్‌ఖాన్‌. 'పోకిరి' పాట‌తో త‌న‌దైన స్టైల్లో అందాలు ప‌రిచిన ముమైత్ టాలీవుడ్‌లో హాట్ ఫేవ‌రేట్‌‌గా మారిపోయింది. ఆ త‌రువాత ఏ సినిమా చూసినా ముమైత్ పాటే అనేంత‌గా పాపుల‌ర్ అయిపోయింది. ఒక ద‌శ‌లో కీల‌క పాత్ర‌ల్లోనూ, 'మైస‌మ్మ ఐపీఎస్‌' లాంటి చిత్రాల్లోనూ న‌టించి ఆక‌ట్టుకుంది.

ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. పైగా ముమైత్‌కు అవ‌కాశాలు ఇచ్చేవారు కూడా క‌రువ‌య్యారు. దీంతో ప్ర‌స్తుతం ఓంకార్ నిర్వ‌హిస్తున్న డాన్స్ బేస్డ్ షో డాన్స్ ప్ల‌స్‌లో న్యాయ నిర్ణేత‌గా పాల్గొంటోంది. ఇదిలా వుంటే ఇటీవ‌ల ఓ షోలో పాల్గొన్న ముమైత్ త‌న వ్య‌క్తిగత విష‌యాల్ని వెల్ల‌డించింది.

"నేను తెలుగు బాగానే మాట్లాడ‌తాను. నాకు హిందీ, ఇంగ్లీష్‌, తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌లు తెలుసు. అమ్మి త‌మిళియ‌న్‌. సౌత్ ఇండియా ముస్లీం. సో.. మ‌మ్మీ సైడ్ ఫ్యామిలీ మొత్తం త‌మిళ్ మాట్లాడ‌తారు. నాకు అలా త‌మిళం వ‌చ్చింది. నాన్న గురించి చెప్పాలంటే కాస్త భ‌యంగా వుంది. వాళ్ల‌ది పాకిస్తాన్‌‌. ఫాద‌ర్ సైడ్ ఫ్యామిలీ అంతా పాకిస్తానీయులే. ఇండియాకి వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. అమ్మ త‌మిళ‌నాడు.. నాన్న పాకిస్తాన్‌.. అలా నేను మిక్స్డ్ బ్రీడ్‌." అని అస‌లు విష‌యం చెప్పింది ముమైత్‌.